కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా ప్రకారం, ఈ ఏడాది అక్షయ తృతీయ వ్యాపారం రూ. 20,000 కోట్ల మార్కును తాకనుంది. గత ఏడాది ఇది రూ. 16,000 కోట్లుగా ఉండగా, ఈసారి భారీ పెరుగుదల కనిపిస్తోంది. బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ, ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ వల్ల విక్రయాలు ఏమాత్రం తగ్గడం లేదు. వ్యాపారులు కూడా ఈ డిమాండ్‌ను తట్టుకోవడానికి భారీగా సిద్ధమయ్యారు. ధరల భారం పెరగడంతో వ్యాపారులు కూడా ప్రతిరోజూ ధరించేలా చిన్న చిన్న నగలను అందుబాటులోకి తెచ్చారు.

