కాలేజీలో అంటెడెన్స్ ఫీజులు కట్టలేదని యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నాడు. వనస్థలిపురం శ్రీ ఇందు కాలేజీలో మ్యాదరి ప్రణీత్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీలో అటెండెన్స్ విషయమై కండోనేషన్ ఫీజు కట్టలేదని హాల్ టికెట్ ఇవ్వడానికి యాజమాన్యం నిరాకరించింది. దీంతో హయత్ నగర్ లో తన ఇంట్లో ఉరివేసుకొని ప్రణీత్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని, కాలేజీ ముందు తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు ఆందోళనకు దిగారు.

