పశ్చిమ బెంగాల్‌లోని మహిళలకు మమతా బెనర్జీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు ప్రధాని మోదీ. కాంగ్రెస్‌తో కలిసి మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిందని మోదీ అన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి మహిళలకు టీఎంసీ వెన్నుపోటు పొడిచింది. బెంగాల్ ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాకూడదని టీఎంసీ కోరుకుంటోంది. వారి మహా జంగిల్ రాజ్యాన్ని అడ్డుకుంటారనే మమతా బెనర్జీ పార్టీ ఇదంతా చేస్తోంది. ప్రజలు జంగిల్ రాజ్యాన్ని ఓడించాలి అని మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.

