ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ తన దురాక్రమణ ధోరణిని మరోసారి ప్రదర్శించారు. ఆదివారం ఉదయం ఉత్తర కొరియా జరిపిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం అంతర్జాతీయ సమాజంలో తీవ్ర కలకలం రేపింది. ఏప్రిల్ నెలలోనే ఇది నాలుగో ప్రయోగం కావడం గమనార్హం. ఈ క్షిపణులు జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ) వెలుపల సముద్రంలో పడ్డాయి. జపాన్ ప్రధాని సనాయే తకైచి వెంటనే అత్యున్నత స్థాయి భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేసి, సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు

