మనీ లాండరింగ్ కేసులో వ్యాపారవేత్త అనిల్ అంబానీకి ఈడీ షాకిచ్చింది. ముంబైలోని అనిల్ అంబానీకి చెందిన రూ.3,716 కోట్ల ఖరీదైన ఇంటిని ఈడీ అటాచ్ చేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) సంస్థ బ్యాంకు మోసాలకు పాల్పడిందనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరుపుతోంది. ఈ కేసులో మొత్తం ఇప్పటివరకు రూ.12,000 కోట్ల విలువైన అనిల్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

