భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్ వెళ్లిన సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా బుధవారం ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రసంగించిన తొలి భారత ప్రధాని తానేనని మోదీ అన్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రసంగం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. భారత్, ఇజ్రాయెల్.. ప్రాచీన నాగరికత కలిగిన దేశాలు. ఇజ్రాయెల్‌తో 140 కోట్ల భారతీయుల స్నేహం, గౌరవం, భాగస్వామ్యం ఉంది. ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్‌కు పూర్తి అండగా ఉన్నాం.

