ఖమ్మం పట్టణ శివారులోని భూదాన్ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న వారి ఇళ్లను ప్రభుత్వ యంత్రాంగం తొలగించింది. తాము రోడ్డుపై పడిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ బాధితులు ఖమ్మం–వైరా రోడ్డుపై ధర్నాకు దిగారు. ఇళ్లను ఖాళీ చేయించి, నిర్వాసితులను పట్టణంలోని అంబేద్కర్ భవన్కు తరలించినట్లు సమాచారం. అయితే తగిన సౌకర్యాలు కల్పించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులకు మద్దతుగా బీజేపీ నేతలు వైరా రహదారిపై ధర్నాలో పాల్గొని, తక్షణమే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు.

