నటి శివానీ నాగారం ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తనకు తిరుమలలో 15 నిమిషాల పాటు స్వామివారి దర్శనం కలిగిందని చెప్పడం వివాదానికి దారితీసింది. సెలబ్రిటీలకు టీటీడీ పెద్దపీట వేస్తోందని నెటిజన్లు విమర్శించగా, శివానీ తాజాగా వీడియో ద్వారా వివరణ ఇచ్చింది. తాను తన తల్లితో కలిసి రూ. 10500 శ్రీవాణి దర్శనం టికెట్లు తీసుకొని వెళ్లామని తెలిపింది. లైన్లో స్వామివారు వెళ్లే మొత్తం సమయాన్ని కలిపి తాను 15 నిమిషాలని అన్నానని, అంతేకానీ గర్భాలయంలో ఎవరూ తనను ఎక్కువసేపు ఉంచలేదని ఆమె స్పష్టం చేసింది.

