రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నారని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అమరవీరులకు నివాళులర్పించి సమ్మెను ముందుకు తీసుకెళ్తామని.. కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాలయాపన కోసమే ప్రభుత్వం కమిటీ వేసిందని విమర్శించారు. కమిటీ అవసరం లేదని.. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు జేఏసీ చైర్మన్ తెలిపారు.

