loader

వణికిపోయిన షాహీన్ అఫ్రిది.. గెలిచినా ఏడ్చిన పాక్ ప్లేయర్లు!

పాకిస్థాన్ 5 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. అయితే, పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. శ్రీలంక  దసున్ షనక విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. షాహీన్ అఫ్రిది వేసిన చివరి ఓవర్లో శ్రీలంక విజయానికి 28 పరుగులు అవసరం కాగా, షనక వరుసగా 4, 6, 6, 6 బాదడంతో పాక్ శిబిరంలో వణుకు మొదలైంది.ఆఖరి రెండు బంతుల్లో షాహీన్ అఫ్రిది కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో శ్రీలంక […]

ప్రపంచకప్‌ నుంచి పాకిస్థాన్ ఔట్.. సెమీస్‌కు దూసుకెళ్లిన న్యూజిలాండ్‌..!

పొట్టి ప్రపంచకప్‌ నుంచి పాకిస్థాన్ నిష్క్రమించింది. సెమీఫైనల్ బెర్తుపై కన్నేసిన పాక్ భారీ తేడాతో శ్రీలంకను ఓడించలేకపోయింది. ఓపెనర్ ఫర్హాన్‌(100) సెంచరీతో పల్లెకెలె స్టేడియంలోభారీ స్కోర్ చేసినా.. బౌలర్లు శ్రీలంకను 147లోపు కట్టడి చేయలేకపోయారు. 212 రన్స్ కొట్టినా పాకిస్థాన్ బంతితో మాత్రం శ్రీలంకను పడగొట్టలేకపోయింది. మైనస్ రన్ రేటులో ఉండడంతో లంకను 147లోపే కట్టడి చేస్తేనే పాక్ సెమీస్ దూసుకెళ్లే పరిస్థితి.కానీ, పవన్ రత్ననాయకే(58), కెప్టెన్ దసున్ శనకతో కీలక భాగస్వామ్యం నెలకొల్పి.. పాక్ ఆశలను […]

దుబాయ్‌లో హై టెన్షన్.. బుర్జ్ ఖలీఫా ఖాళీ..

ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ కూడా క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా వైమానిక స్థావరాలున్న పలు గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో దుబాయ్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవనాన్ని ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఖాళీ చేయిస్తున్నారు. ఇరాన్ నుంచి క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో ఈ భవనంలోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. దుబాయ్‌లో కూడా బాంబుల శబ్దాలు వినిపించినట్టు వార్తలు […]

పశ్చిమాసియాలో యుద్ధం.. ఐరాస అత్యవసర సమావేశం..!

పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న వేళ.. ఐరాసలోని 15 మందితో కూడిన బృందం సాయంత్రం నాలుగు గంటలకు న్యూయార్క్‌లో అత్యవసరంగా భేటీ అవ్వనుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 2 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. ఇరాన్‌పై ఇజ్రాయేల్, అమెరికా సంయుక్తంగా చేపట్టిన సైనిక దాడులను ఖండిస్తూ.. రష్యా, చైనా, ఫ్రాన్స్, బహ్రెయిన్, కొలంబియా దేశాలు ఐరాస అత్యవసర భేటీని కోరాయి. ఈ సమావేశానికి బ్రిటన్ అధ్యక్షత వహించనుంది.

వివాహం విఫలమవుతుందన్న జ్యోతిష్కుడు.. టెకీ ఆత్మహత్య

బెంగళూరులో ఐటీ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగిని ఒక వ్యక్తిని ప్రేమించింది. అతడితో పెళ్లికి ఆమె కుటుంబం కూడా అంగీకరించింది. అయితే ఆమె వివాహం విఫలమవుతుందని ఒక జ్యోతిష్కుడు చెప్పాడు. మనస్తాపం చెందిన ఆ మహిళ ఆత్మహత్య చేసుకున్నది. పెళ్లి తర్వాత తన జీవితం ఎలా ఉంటుంది అన్నది తెలుసుకునేందుకు ఒక జ్యోతిష్కుడిని విద్యాజ్యోత్ సంప్రదించింది. అయితే ప్రేమించిన వ్యక్తితో ఆమె వివాహం విఫలమవుతుందని, రెండేళ్లకే వారిద్దరూ విడిపోతారని  జ్యోతిష్కుడు చెప్పాడు.

అభుదాబిలో చిక్కుకున్న తెలుగువాళ్లు

అభుదాబిలో పలువురు తెలుగువాళ్లు చిక్కుకుపోయారు. అమెరికా నుంచి బయలుదేరి అభుదాబిలో ఇతిహాద్ విమానం ఆగింది. ఈరోజు(శనివారం) మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి రాత్రికి ఈ విమానం శంషాబాద్ చేరుకోవాల్సి ఉంది. ఎయిర్ బేస్‌పై మరిన్ని దాడులు జరుగవచ్చోమోనని అభుదాబిలో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో అబుదాబి గగనతలాన్ని అక్కడి ప్రభుత్వం మూసివేసింది. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో తెలుగువాళ్లు చిక్కుకుపోయారు.

పశ్చిమ బెంగాల్ ఎస్ఐఆర్ తుదిజాబితా విడుదల

పశ్చిమబెంగాల్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియ అనంతరం ఓటర్ల తుది జాబితాను భారత ఎన్నికల కమిషన్ శనివారంనాడు విడుదల చేసింది. 2026 ఫిబ్రవరి 28వ తేదీనాటికి మొత్తం 7.04 కోట్ల మంది ఎన్నికల జాబితాలో చోటుచేసుకున్నట్టు తెలిపింది. 63.66 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. ఫారం-7 ద్వారా 5.46 లక్షల మంది ఓటర్లను తొలగించగా, ఫారం-6, ఫారం-6ఏ సబ్మిషన్ల ద్వారా 1.82 లక్షల మందిని ఓటర్ల జాబితాలో చేర్చినట్టు చెప్పారు.

ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ రక్షణ మంత్రి మృతి!

అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ రెండు దేశాలు సంయక్తంగా ఇరాన్‌పై మిసైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే ఇరాన్‌లో ఓ స్కాల్‌పై బాంబులు పడడంతో సుమారు 50 మంది వరకు విద్యార్థులు మృతి చెందారు. అయితే తాజాగా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నసీర్జాదే ,రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మొహమ్మద్ పక్పూర్ మరణించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్‌ కూడా మృతి చెందినట్టు స్థానిక మీడియాలు […]

దేశ సెమీకండక్టర్ రంగంలో సరికొత్త శకం..గుజరాత్‌లో మైక్రాన్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

గుజరాత్‌లోని సానంద్‌లో ఏర్పాటు చేసిన మైక్రాన్ టెక్నాలజీ సెమీకండక్టర్ ఏటీఎంపీ (అసెంబ్లీ, టెస్ట్, మార్కింగ్, ప్యాకేజింగ్) ప్లాంట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఘనంగా ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియా లక్ష్యంగా నిర్మించిన ఈ అత్యాధునిక కర్మాగారం నుంచి వాణిజ్యపరమైన ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభం కాగా, తొలి స్వదేశీ సెమీకండక్టర్ మెమరీ మాడ్యూల్స్ షిప్‌మెంట్‌ను సైతం ఈ సందర్భంగా ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు. సెమీకండక్టర్ సప్లై చైన్‌లో భారతదేశ స్థానాన్ని పటిష్టం చేయడంలో మైలురాయిగా నిలిచిపోతుందని కేంద్ర ప్రభుత్వం […]

కాకినాడ జిల్లా బాణసంచా పేలుళ్ల ఘటన.. కేంద్రప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా..

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలంలో బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదంలో మృతుల సంఖ్య 24కి చేరింది. ‘కాకినాడ జిల్లాలోని కర్మాగారంలో ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్‌గ్రేషియా పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి అందజేస్తున్నాం’ అని ప్రధాని మోదీ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON