పశ్చిమబెంగాల్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియ అనంతరం ఓటర్ల తుది జాబితాను భారత ఎన్నికల కమిషన్ శనివారంనాడు విడుదల చేసింది. 2026 ఫిబ్రవరి 28వ తేదీనాటికి మొత్తం 7.04 కోట్ల మంది ఎన్నికల జాబితాలో చోటుచేసుకున్నట్టు తెలిపింది. 63.66 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. ఫారం-7 ద్వారా 5.46 లక్షల మంది ఓటర్లను తొలగించగా, ఫారం-6, ఫారం-6ఏ సబ్మిషన్ల ద్వారా 1.82 లక్షల మందిని ఓటర్ల జాబితాలో చేర్చినట్టు చెప్పారు.

