తేజస్వి యాదవ్ హెచ్చరిక.. అదే జరిగితే ఎన్నికల్లో పోటీ చేయను
బిహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా ఇండియా కూటమి ఎన్నికల్లో పోటీ చేస్తే తాను ఎన్నికల్లో పోటీ చేసేది లేదని తేల్చి చెప్పారు. సీట్ల పంపకం పూర్తయిన వెంటనే సీఎం అభ్యర్థిపై స్పష్టత వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని తేజస్వి యాదవ్ స్పష్టం చేశారు.

