మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌పై అనకాపల్లి ఎంపీ సీఎమ్ రమేష్ జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఇటీవల సీఎం రమేష్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ గాదరి కిశోర్ (Gadari Kishore news) తనపై దూషణలకు దిగారని సీఎమ్ రమేష్ పేర్కొన్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సీఎం రమేష్ ఫిర్యాదు చేశారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు గాదరి కిశోర్‌కు నోటీసులు అందచేశారు. విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు

