భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తితో వెంకయ్య నాయుడు తిరుగుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, తిరిగి పొగడటం చంద్రబాబుకే చెల్లిందని లక్ష్మీపార్వతి విమర్శించారు. చంద్రబాబుకు వెయ్యి నాలుకలు ఉన్నాయని అన్నారు. ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, ఇప్పుడు ఆయనపై గొప్పగా పుస్తకాలు రాస్తున్నారని మండిపడ్డారు.

