తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వి.కె. శశికళకు సంబంధించిన బినామీ ఆస్తులు, మనీలాండరింగ్ కేసులో ED దర్యాప్తును వేగవంతం చేసింది. శశికళకు బినామీగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్గ్ గ్రూప్‌నకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జీఆర్‌కే రెడ్డి నివాసాలు, కార్యాలయాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. చెన్నై మరియు హైదరాబాద్‌లోని సుమారు పది ప్రదేశాల్లో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద తనిఖీలు చేపట్టారు.

