బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ తొలి వారంలో తొలి దశ ఉండనున్నది. ఎన్నికల సంఘం డ్రాఫ్ట్ ప్రపోజల్ ద్వారా ఓ మీడియా సంస్థ ఈ అంచనా వేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను అక్టోబర్ మొదటి వారంలో ఈసీ ప్రకటించనున్నది. ఛాత్ పూజా సంబరాలు ముగిసిన తర్వాత ఎన్నికల ప్రక్రియ చేపట్టాలన్న ఆలోచనలో ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది. మూడు దశల్లోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ ప్రణాళిక వేసినట్లు భావిస్తున్నారు.

