loader

తమిళనాడుకు చెందిన ప్రముఖ నటుడు, తమిళ వెట్రి కజగం చీఫ్‌ విజయ్ ఇంట్లో భారీ భద్రతా వైఫల్యం బయటపడింది. ఒక అగంతకుడు నీలంకరైలోని విజయ్‌ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంటి టెర్రస్‌పై తిరుగుతూ కనిపించాడు. భద్రతా సిబ్బంది గమనించారు. వెంటనే అప్రమత్తమై ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి పేరు అరుణ్(24) అని.. గత నాలుగేళ్లుగా అతడి మానసిక స్థితి సరిగ్గా లేదని గుర్తించారు. అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. విజయ్‌కు కేంద్ర హోం శాఖ ఇటీవల వై+ భద్రతను కల్పించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON