టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని అక్రమ కేసులతో అరెస్టు చేయాలని చూస్తున్నారని తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త భూమన అభినయ్ వెల్లడించారు. కొంతకాలంగా టీటీడీ పాలక మండలికి, కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా మారిన భూమన కరుణాకర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైనట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని అన్నారు. భూమన అక్రమ అరెస్టుతో వైసీపీ నోళ్లు మూయించలేరని స్పష్టం చేశారు.

