కాంగ్రెస్ పార్టీ బిహార్ యూనిట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ ఏఐ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ నేపథ్యంలో పాట్నా హైకోర్ట బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆ వీడియోను తక్షణమే అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల నుంచి తొలగించాలని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీబీ బజంతరి ఈ మేరకు ప్రకటించారు. ఈ ఏఐ వీడియో బిహార్ కాంగ్రెస్ యూనిట్ అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి షేర్ అయ్యింది.

