loader

నా హత్యకు కుట్ర చేశారు.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఎమ్మెల్యే డీవీ (కావ్య) కృష్ణారెడ్డి క్వారీ దగ్గర కొందరు డ్రోన్‌తో సంచరించడం కలకలం రేపింది. జలదంకి మండలం అన్నవరంలో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది.. వారి దగ్గర మారణాయుధం కూడా లభ్యమైందని సమాచారం. తనను హత్య చేసేందుకే వారు వచ్చారని ఎమ్మెల్యే ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతో ఇదంతా చేశారని.. తనను చంపేందుకు రెక్కీ నిర్వహించారని ఆరోపించారు. డ్రోన్ ఎగరేసినవారిని పట్టుకుని అడిగితే వారు […]

ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నామినేషన్

ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ బుధవారం తన నామినేషన్ పత్రాలను అధికారికంగా దాఖలు చేశారు. ఈ కార్యక్రమం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఎందుకంటే, ఆయన నామినేషన్ దాఖలు సమయంలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు హాజరై ఎన్డీఏ ఐక్యతను మరింత బలపరిచారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించే సమయంలో వేదికపైనే ఒక బలమైన రాజకీయ […]

సీఎం కాళ్లు మొక్కిన ఐఏఎస్‌కు కీలక పదవి.. కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియామకం

కొన్ని నెలల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట సభలో స్టేజీ మీద ఉన్న ఐఏఎస్ అధికారి ఒకరు వచ్చి రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కడం అప్పుడు సంచలనంగా మారింది. ఆ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఏ శరత్.. పదవీ విరమణ పొందారు. అయితే సీఎం కాళ్లు మొక్కిన 3 నెలలకే.. ఆ విశ్రాంత ఐఏఎస్ అధికారికి.. పదవి దక్కడం ఇప్పుడు మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది.

తెలంగాణలో ఐటీ దాడులు.. మాజీ ఎంపీ నివాసంలో సోదాలు

చేవెళ్ల మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు రంజిత్ రెడ్డికి ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు షాకిచ్చారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌లోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి ప్రముఖ నిర్మాణ సంస్థ డీఎస్ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌లో జరుగుతున్న సోదాలకు కొనసాగింపుగా జరుగుతున్నాయి. ఐటీ అధికారులు డీఎస్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలో ఒకేసారి పలు చోట్ల దాడులు నిర్వహించారు. మొత్తం 10 బృందాలుగా విడిపోయిన అధికారులు CRPF బలగాల బందోబస్తు మధ్య సోదాలు నిర్వహిస్తున్నారు.

ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యాఖ్యలు..సీఎం చంద్రబాబు వార్నింగ్

జూనియర్ ఎన్టీఆర్ సినిమాను లక్ష్యంగా చేసుకుని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యాఖ్యల ఘటనపై సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. నేతల నిర్లక్ష్య వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా మారుతున్నాయని సీఎం కామెంట్ చేశారు. అనంతపురం ఘటనతో పాటు ఆముదాలవలస, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేల ప్రవర్తనపై వచ్చిన వార్తల పట్ల కూడా చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. “పార్టీ కంటే వ్యక్తిగతం గొప్పదని భావించే వారికి టీడీపీలో స్థానం లేదు” అని కఠినంగా హెచ్చరించారు.

అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ కు చంద్రబాబు, లోకేశ్ శుభాకాంక్షలు

ఎన్డీయే నుంచి ఉపరాష్ట్రపతి పదవికి సీపీ రాధాకృష్ణన్‌ ను అభ్యర్థిగా ప్రకటించిన విషయంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర గవర్నర్‌గా సేవలందిస్తున్న రాధాకృష్ణన్‌ ఎంపికను ఆయన హర్షంగా స్వీకరించారు. టీడీపీ తరఫున ఆయనకు సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.సోషల్ మీడియా వేదికగా స్పందించిన చంద్రబాబు, రాధాకృష్ణన్ అనుభవాన్ని కొనియాడారు. “అన్ని స్థాయిల్లో ప్రభుత్వ పదవుల్లో సేవలందించిన గొప్ప నాయకుడు. ఆయ‌న‌ రాజ‌కీయ జీవితం సుదీర్ఘం, అనుభవంతో నిండిపోయినది,” అంటూ […]

మహారాష్ట్ర ఓట్లపై అభ్యంతరాలు ఎందుకు చెప్పలేదు- CEC

మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు ఓటర్ల సంఖ్య పెరిగిందనే ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం (CEC) జ్ఞానేశ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన డ్రాఫ్ట్ లిస్ట్ విడుదల చేసిన సమయంలో ఎందుకు అభ్యంతరాలు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు ముగిసి ఎనిమిది నెలల తర్వాత ఈ ఆరోపణలు చేయడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవని ఆయన స్పష్టం చేశారు.

ఆస్పత్రిలో చేరిన ఒడిశా మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌

బిజూ జనతాదళ్‌(బీజేడీ) పార్టీ అధ్యక్షుడు, ఒడిశా మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌ హస్పిటల్‌లో చేరారు. వయసు సంబంధిత సమస్యల వల్ల ఆయన ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ.. శనివారం రాత్రి పట్నాయక్ గారి ఆరోగ్యం కాస్త విషమించింది. ఆదివారం నాటికి పరిస్థితిలో మార్పు లేకపోవడంతో.. ఆయనను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చామని తెలిపారు.

ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్..

ఉప రాష్ట్రపతి అభ్యర్థిపై ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డ్‌ సమావేశంలో ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ను బీజీపీ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటన విడుదల చేశారు. సీపీ రాధాకృష్ణన్ స్వస్థలం తమిళనాడు.. గతంలో కోయంబత్తురు ఎంపీగా పనిచేసిన రాధాకృష్ణన్.. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. ఆయన గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు.

దేశానికి జగన్ క్షమాపణ చెప్పాలి- మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ జెండాను ఎగురవేయకపోవడంపై రాజకీయంగా వివాదం చెలరేగింది. రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఈ అంశంపై తీవ్రంగా స్పందిస్తూ, జగన్ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లోకేశ్ తన ట్వీట్‌లో, ఇది కేవలం అహంకారం మాత్రమే కాదని, దేశ స్వాతంత్ర్య పోరాటానికి జరిగిన తీవ్ర అవమానమని పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON