loader

పోలింగ్ బూత్లు డ్రెస్ ఛేంజింగ్ రూమ్స్ కాదు- ప్రకాశ్ రాజ్

ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, సీసీటీవీ ఫుటేజీ ఇవ్వడానికి ఎన్నికల సంఘం (EC) నిరాకరించడంపై ప్రకాశ్ రాజ్ తన పోస్ట్‌లో ఈసీ వాదనను తీవ్రంగా ఖండించారు. “పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీలు పెట్టే ముందు మీరు మహిళల అనుమతి తీసుకున్నారా? పోలింగ్ బూత్‌లు డ్రెస్ ఛేంజింగ్ రూమ్‌లు కావు” అని ఆయన ప్రశ్నించారు. ఈసీ చెప్పే సాకులు తమకు ఆసక్తి లేవని, ఎన్నికల ప్రక్రియలో పూర్తి పారదర్శకత కావాలని ఆయన స్పష్టం చేశారు.

హిమాచల్ ప్రదేశ్లో 56 రోజుల్లో 261 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్‌లో ఈ ఏడాది కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. జూన్ 20 నుంచి నిన్నటి వరకు జరిగిన పలు ఘటనల్లో 261 మంది మరణించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. వరదలు, కొండచరియలు విరిగిపడటం, ఇతర వర్ష సంబంధిత ప్రమాదాల్లో 136 మంది ప్రాణాలు కోల్పోగా, మిగిలిన 125 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. ఈ సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.

ఆస్పత్రిలో చేరిన ఒడిశా మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌

బిజూ జనతాదళ్‌(బీజేడీ) పార్టీ అధ్యక్షుడు, ఒడిశా మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌ హస్పిటల్‌లో చేరారు. వయసు సంబంధిత సమస్యల వల్ల ఆయన ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ.. శనివారం రాత్రి పట్నాయక్ గారి ఆరోగ్యం కాస్త విషమించింది. ఆదివారం నాటికి పరిస్థితిలో మార్పు లేకపోవడంతో.. ఆయనను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చామని తెలిపారు.

న్యూయార్క్‌లో కాల్పుల మోత … ముగ్గురు మృతి

అమెరికా మళ్లీ కాల్పుల దృశ్యానికి వేదిక అయింది. ఈసారి ఘటన చోటు చేసుకున్న ప్రదేశం న్యూయార్క్‌లోని బ్రూక్లిన్. ఆదివారం తెల్లవారుజామున స్థానికంగా ఉన్న ఓ నైట్‌క్లబ్‌లో దుండగులు అర్ధరాత్రి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘోర ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి క్రౌన్ హైట్స్ ప్రాంతంలోని ఫ్రాంక్లిన్ అవెన్యూలో ఉన్న ‘టేస్ట్ ఆఫ్ ది సిటీ’ లాంజ్‌లో జరిగింది.

ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్..

ఉప రాష్ట్రపతి అభ్యర్థిపై ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డ్‌ సమావేశంలో ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ను బీజీపీ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటన విడుదల చేశారు. సీపీ రాధాకృష్ణన్ స్వస్థలం తమిళనాడు.. గతంలో కోయంబత్తురు ఎంపీగా పనిచేసిన రాధాకృష్ణన్.. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. ఆయన గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు.

దేశానికి జగన్ క్షమాపణ చెప్పాలి- మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ జెండాను ఎగురవేయకపోవడంపై రాజకీయంగా వివాదం చెలరేగింది. రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఈ అంశంపై తీవ్రంగా స్పందిస్తూ, జగన్ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లోకేశ్ తన ట్వీట్‌లో, ఇది కేవలం అహంకారం మాత్రమే కాదని, దేశ స్వాతంత్ర్య పోరాటానికి జరిగిన తీవ్ర అవమానమని పేర్కొన్నారు.

రాజగోపాల్ రెడ్డి వినకపోతే వేటు తప్పదు- మల్లు రవి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పీసీసీ చీఫ్ తమ దృష్టికి తీసుకువచ్చారని ఆయన తెలిపారు. పార్టీ నిబంధనలను పాటించకపోతే ఆయనపై వేటు తప్పదని మల్లు రవి స్పష్టం చేశారు. పార్టీలో అందరినీ సమన్వయం చేసుకుంటూ, విభేదాలను సరిదిద్దుతూ, అందరూ కలిసి పనిచేసేలా చూసే బాధ్యత తనదేనని మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని, దానిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి […]

అసత్య ప్రచారం చేస్తూ భారత రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు: సీఈసీ జ్ఞానేష్ కుమార్

రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఓట్ చోరీ, ఎస్ఐఆర్ గురించి చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్ స్పందించారు.. ఆదివారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఓటర్లను తప్పుదారి పట్టించడానికి జరిగిన విఫల ప్రయత్నాలు.. రాజ్యాంగాన్ని అవమానించడం తప్ప మరేమీ కాదంటూ.. ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజకీయ పార్టీల BLA ల సమక్షంలోనే ఓటర్ల జాబితా సవరణ జరిగిందన్నారు. ఆయా రాజకీయ పార్టీలు కావాలనే ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. SIR పై […]

నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఖైదీతో మహిళ సరసాలు..

ఓ హత్య కేసులో దోషి గూడూరుకు చెందిన శ్రీకాంత్ ఖైదీగా ఉన్నాడు. హోం శాఖ అతనికి 30 రోజుల పెరోల్ మంజూరు చేసింది. శ్రీకాంత్ కారాగారంలో ఉంటే అతని గ్యాంగ్‌ను తానే నడిపిస్తూ దందాలు చేయిస్తున్న సదరు మహిళే.. నెల్లూరు జిల్లాలో కొంతమంది రాజకీయ నాయకులతో పాటు సచివాలయంలోని కొందరు ఉన్నతాధికారులను ప్రభావితం చేసి మరీ ఈ పెరోల్ మంజూరు చేయించారని చెబుతున్నారు.  మహిళ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారినా పోలీసులు చోద్యం చూస్తూ […]

రాజ్యాంగాన్ని నిర్మూలించాలని బీజేపీ-ఆర్‌ఎస్ఎస్ కుట్ర చేస్తున్నాయి.. రాహుల్ గాంధీ విమర్శ

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బీహార్ లోని ససరాం నుంచి “ఓటర్ అధికార్ యాత్ర” ను ప్రారంభించారు. బీహార్‌లో ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలో ఈ యాత్రను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని రక్షించేందుకు ఓటర్ అధికార్ యాత్రను మొదలుపెట్టినట్టు తెలిపారు. బీజేపీ-ఆర్‌ఎస్ఎస్ కలిసి రాజ్యాంగాన్ని నిర్మూలిద్దామని చూస్తున్నాయని విమర్శలు గుప్పించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON