రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఓట్ చోరీ, ఎస్ఐఆర్ గురించి చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్ స్పందించారు.. ఆదివారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఓటర్లను తప్పుదారి పట్టించడానికి జరిగిన విఫల ప్రయత్నాలు.. రాజ్యాంగాన్ని అవమానించడం తప్ప మరేమీ కాదంటూ.. ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజకీయ పార్టీల BLA ల సమక్షంలోనే ఓటర్ల జాబితా సవరణ జరిగిందన్నారు. ఆయా రాజకీయ పార్టీలు కావాలనే ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. SIR పై అసత్య ప్రచారం చేస్తున్నారు.. భారత రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారంటూ జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు.

