తిరుపతి శేషాచల అటవీ ప్రాంతంలో మరోసారి అగ్నిప్రమాదం చెలరేగి ఆందోళన కలిగించింది. తిరుమలకు వెళ్లే డౌన్ ఘాట్ రోడ్డుకు సమీపంలోని అడవి ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుంది. ఎండలు తీవ్రంగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించే పరిస్థితి ఏర్పడటంతో, ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. అడవిలో ఎండిపోయిన ఆకులు, చెట్ల కొమ్మలు మంటలకు ఆహుతవుతుండటంతో అగ్ని మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం కనిపించింది.

