పశ్చిమ బెంగాల్ రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర కోల్‌కతాలో భారీ రోడ్‌షో నిర్వహించడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక తంతానియా కాళిబారిని సందర్శించారు. ఈ ఆలయానికి కోల్‌కతా నగరం కంటే పురాతనమైన చరిత్ర ఉంది. 1703వ సంవత్సరంలో స్థాపించిన తంతానియా కాళిబారికి 300 ఏళ్లకు పైగా విశిష్ట చరిత్ర ఉంది. ఇక్కడ కొలువైన మా సిద్ధేశ్వరిని భక్తులు జాగ్రత్ దేవతగా అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తారు, నగర అభివృద్ధికి ముందే ఈ క్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రంగా వెలిసింది.

