loader

జనగణనలో వివరాలు నమోదు చేసిన సీఎం రేవంత్

జనగణన 2027లో భాగంగా తెలంగాణలో నేటి నుంచి ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ ప్రక్రియ ప్రారంభమైంది. తాజాగా సెన్సస్ 2027 స్వీయ నమోదు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా తన వివరాలను స్వయంగా సీఎం నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా సెన్సస్ అధికారులు స్వీయ నమోదు ప్రక్రియ విధానం, ప్రాముఖ్యత గురించి ముఖ్యమంత్రికి వివరించారు.

అండర్ వరల్డ్‌కు షాక్: దావూద్ ఇబ్రహీం రైట్ హ్యాండ్ అరెస్ట్!

సలీం డోలా అంటే కేవలం ఒక నేరగాడు మాత్రమే కాదు.. దావూద్ ఇబ్రహీం అంతర్జాతీయ నార్కోటిక్స్ (డ్రగ్స్) నెట్‌వర్క్‌ను సమన్వయం చేసే ప్రధాన ‘మేనేజర్’. భారత గూఢచారి సంస్థలు, అంతర్జాతీయ పోలీసుల సమన్వయంతో సాగిన అత్యంత రహస్య ఆపరేషన్ ఫలితంగా.. సలీం డోలా టర్కీలోని ఇస్తాంబుల్‌లో పట్టుబడ్డాడు. అంతర్జాతీయ స్మగ్లర్లతో డీల్స్ కుదర్చడంలో ఇతను సిద్ధహస్తుడు. ముంబైలో జరిగిన ఒక భారీ డ్రగ్స్ స్కామ్ తర్వాత పరారీలో ఉన్న డోలా, ఇస్తాంబుల్లో మారువేషంలో తలదాచుకుంటూ చివరకు అధికారుల […]

ఎపిలో ఇంధన కొరత.. బంకుల్లో నోస్టాక్ బోర్డులు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన కొరత ఏర్పడింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో డీజిల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరులోని పలు చోట్ల బంకుల వద్ద డీజిల్ నో స్టాక్ బోర్డులు పెట్టారు. కొన్ని చోట్ల బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. మేడికొండూరు, పేరేచర్లతోపాటు పల్నాడులోని వివిధ మండలాల్లో డీజిల్ కొరత ఉంది. కొన్ని బంకుల్లో ఆటోల్లో రూ.200, కార్లలో రూ.500 డీజిల్ మాత్రమే కొడుతున్నారు.మార్కాపురం జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది.వివిధ బంకుల్లో వాహనాల రద్దీ […]

నేటి నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ బంద్

ఫ్లైఓవర్ పనుల కారణంగా ఉప్పల్ రింగ్ రోడ్డులో తాత్కాలిక ఆంక్షలు విధిస్తున్నట్లు ఆర్ టిసి అధికారులు ప్రకటించారు. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద హన్మకొండ వైపు వెళ్ళే బస్సులు ఆగే బస్టాండ్‌ను నల్లచెరువు వద్ద ఏర్పాటు చేశారు. బోడుప్పల్ వైపు నుండి వచ్చే వాహనాలు ఏషియన్ థియేటర్ వద్ద నుండి భగాయత్ లే-అవుట్ ద్వారా నాగోల్ చేరుకోవాలని సూచించారు. సికింద్రాబాద్ నుండి వరంగల్ వైపు వెళ్లే భారీ వాహనాలు హబ్సిగూడ నుండి నాచారం ద్వారా చెంగిచర్ల చేరుకుని […]

ఫ్లైఓవర్‌ కూలి ఏడుగురికి తీవ్ర గాయాలు

విశాఖ జిల్లా వడ్లపూడి వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటో నగర్‌ నుంచి దువ్వాడ వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నటి అషురెడ్డి కుటుంబంపై నాన్ బెయిలబుల్ కేసు

ప్రముఖ సినీనటి, బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. పెళ్లి పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను నమ్మించి సుమారు రూ.10 కోట్ల మేర మోసం చేశారనే అషురెడ్డి, ఆమె సోదరి దివ్యారెడ్డి పై ప కేసు నమోదు చేశారు. లండన్‌లో ఉంటున్న ధర్మేంద్ర అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను వివాహం చేసుకుంటానని నమ్మించి, అషురెడ్డి భారీ మొత్తంలో నగదు, బంగారం వసూలు చేసిందని బాధితుడి తండ్రి […]

దేశంలో నాకంటే అనుభవమున్న సిఎం లేడని కోతలు కోస్తుంటారు: పేర్నినాని

ఎపిలో డీజిల్, పెట్రోల్ కొరతతో ప్రజలు అవస్థలు పడుతున్నారని వైసిపి మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రజలు ఇంధనం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చంద్రబాబు 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నారని, దేశంలో తనకంటే అనుభవమున్న సిఎం లేడని కోతలు కోస్తుంటారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ కొరత వ్యాపారస్తులకు పండుగలా మారిందని పలుకుబడి ఉపయోగించి సమస్యను పరిష్కరించలేరా? అని తమ అనుభవం ఎందుకు? అని ప్రశ్నించారు.  పేద, మధ్యతరగతి ప్రజల బ్రతుకులు నలిగిపోతున్నాయని […]

అణుశక్తి, ప్రకృతి సమతుల్యతపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 133వ ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్‌లో దేశాభివృద్ధి, పర్యావరణం, సంస్కృతి, విజ్ఞాన శాస్త్ర రంగాల్లో భారతదేశం సాధిస్తున్న విజయాలను వివరిస్తూ ఉత్తేజకరమైన ప్రసంగం చేశారు. గౌతమ బుద్ధుని బోధనలు నేటి సంఘర్షణల ప్రపంచానికి అత్యంత అవసరమని ప్రధాని పేర్కొన్నారు. సౌర, పవన శక్తి వినియోగం మన భవిష్యత్తుకు కీలకమని పిలుపునిచ్చారు. తమిళనాడులోని కల్పక్కంలో ఉన్న ఫాస్ట్  బ్రీడర్ రియాక్టర్ (PFBR) క్రిటికాలిటీని సాధించడం ద్వారా మన అణు శాస్త్రవేత్తలు చరిత్ర […]

ఏపీలో భారీ అగ్ని ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా సత్యవేడు శ్రీసిటీలోని ఈ ప్యాక్ పరిశ్రమలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం అక్కడ భారీగా మంటలు ఎగిసిపడుతుండగా.. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుంది. ప్రస్తుతం ఫైర్ ఇంజన్ల సాయంతో సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ట్రంప్‌పై కాల్పులు జరిపిన నిందితుడు ఉన్నత విద్యావంతుడే.. కానీ..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం ఘటనలో పాల్గొన్న నిందితుడిని పట్టుకున్నామని, అతడిని “తీవ్ర మానసిక రోగి” అంటూ డొనాల్డ్ ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. అధికారులు ఆ వ్యక్తి అపార్ట్‌మెంట్‌లో సోదాలు చేశారని, నిందితుడు కాలిఫోర్నియా నివాసి అని కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ పూర్తిశాడు. 2018లో ఓ వీడియోగేమ్‌ను కూడా తయారు చేసి ట్రేడ్‌మార్క్‌ కోసం రిజిస్టర్‌ చేసుకొన్నాడు. ఇటీవల ‘ఫస్ట్‌లా ’ పేరిట మరో గేమ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు లింక్డిన్‌లో వెల్లడించాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON