సలీం డోలా అంటే కేవలం ఒక నేరగాడు మాత్రమే కాదు.. దావూద్ ఇబ్రహీం అంతర్జాతీయ నార్కోటిక్స్ (డ్రగ్స్) నెట్‌వర్క్‌ను సమన్వయం చేసే ప్రధాన ‘మేనేజర్’. భారత గూఢచారి సంస్థలు, అంతర్జాతీయ పోలీసుల సమన్వయంతో సాగిన అత్యంత రహస్య ఆపరేషన్ ఫలితంగా.. సలీం డోలా టర్కీలోని ఇస్తాంబుల్‌లో పట్టుబడ్డాడు. అంతర్జాతీయ స్మగ్లర్లతో డీల్స్ కుదర్చడంలో ఇతను సిద్ధహస్తుడు. ముంబైలో జరిగిన ఒక భారీ డ్రగ్స్ స్కామ్ తర్వాత పరారీలో ఉన్న డోలా, ఇస్తాంబుల్లో మారువేషంలో తలదాచుకుంటూ చివరకు అధికారుల చిక్కాడు.

