జూనియర్ ఎన్టీఆర్ సినిమాను లక్ష్యంగా చేసుకుని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యాఖ్యల ఘటనపై సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. నేతల నిర్లక్ష్య వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా మారుతున్నాయని సీఎం
కామెంట్ చేశారు. అనంతపురం ఘటనతో పాటు ఆముదాలవలస, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేల ప్రవర్తనపై వచ్చిన వార్తల పట్ల కూడా చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. “పార్టీ కంటే వ్యక్తిగతం గొప్పదని భావించే వారికి టీడీపీలో స్థానం లేదు” అని కఠినంగా హెచ్చరించారు.

