దక్షిణ కోల్ కత్తాలోని సఖావత్ మెమోరియల్ స్కూల్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్ను మమత సందర్శించారు. ఆమె పోటీ చేసిన భవానీపుర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలు, బ్యాలెట్ బాక్స్ ను ఇక్కడే భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ఎవరైనా ఈవీఎం యంత్రాలను దొంగిలించడానికి, ఓట్ల లెక్కింపులో అవకతవకలు చేయడానికి ప్రయత్నిస్తే.. జీవన్మరణ పోరాటం చేస్తాం. నా జీవితాంతం పోరాడతాను’ అని అన్నారు.

