కొన్ని నెలల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట సభలో స్టేజీ మీద ఉన్న ఐఏఎస్ అధికారి ఒకరు వచ్చి రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కడం అప్పుడు సంచలనంగా మారింది. ఆ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఏ శరత్.. పదవీ విరమణ పొందారు. అయితే సీఎం కాళ్లు మొక్కిన 3 నెలలకే.. ఆ విశ్రాంత ఐఏఎస్ అధికారికి.. పదవి దక్కడం ఇప్పుడు మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది.

