చేవెళ్ల మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు రంజిత్ రెడ్డికి ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు షాకిచ్చారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్లోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి ప్రముఖ నిర్మాణ సంస్థ డీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్లో జరుగుతున్న సోదాలకు కొనసాగింపుగా జరుగుతున్నాయి. ఐటీ అధికారులు డీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలో ఒకేసారి పలు చోట్ల దాడులు నిర్వహించారు. మొత్తం 10 బృందాలుగా విడిపోయిన అధికారులు CRPF బలగాల బందోబస్తు మధ్య సోదాలు నిర్వహిస్తున్నారు.

