loader

కోటాకు కొత్త ఎయిర్ పోర్టు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజస్థాన్‌‌లోని కోటా-బుండిలో కొత్త గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కటక్‌-భువనేశ్వర్‌ ఆరు లేన్ల రింగ్‌ రోడ్డు నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రింగ్‌ రోడ్డు నిర్మాణానికి రూ. 8307 కోట్ల నిధులు కేటాయించారు. కోటా ఎయిర్‌పోర్ట్‌ను 1507.00 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయడానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రతిపాదనకు కేబినెట్‌ […]

భారీ వర్షాలు… ముంబైలో ఎలివేటెడ్ ట్రాక్ మధ్యలో నిలిచిపోయిన మోనో రైలు

భారీ వర్షాల ఎఫెక్ట్ ముంబై మోనో రైలుపై కూడా పడింది. ఎలివేటెడ్ ట్రాక్‌పై నడిచే మోనోరైల్ ఆకస్మాత్తుగా మధ్యలో నిలిచిపోయింది. మైసూర్ కాలనీ, భక్తి పార్క్ స్టేషన్ల మధ్య ఆగిపోయింది. ‘‘మైసూర్ కాలనీ స్టేషన్ సమీపంలో ప్రయాణిస్తుండగా ఒక మోనో రైలులో స్వల్ప విద్యుత్ సరఫరా సమస్య తలెత్తింది. మా ఆపరేషన్, నిర్వహణ బృందాలు ఇప్పటికే రంగంలో దిగాయి. సమస్యను త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నాయి. ప్రస్తుతానికి వడాలా, చెంబూర్ మధ్య మోనో రైలు సేవలు ఒకే […]

పవన్ ఫ్యాన్స్‌కు బంపర్ బోనాంజా.. ఓటీటీలోకి వీరమల్లు..

పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరి హర వీరమల్లు థియేటర్లలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. క్రిష్-జ్యోతి కృష్ణ దర్శకత్వంలో, ఏఎం రత్నం నిర్మాణంలో వచ్చిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ జూలై 24న గ్రాండ్ రిలీజ్ అయి అభిమానులను ఆకట్టుకుంది. ఇక థియేటర్ల హంగామా ముగియగానే, సినిమా ఓటీటీ వేదికపైకి అడుగుపెడుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 20 నుంచి హరి హర వీరమల్లు – పార్ట్ 1: స్వోర్డ్ […]

నీట్‌ పీజీ 2025 ఫలితాలు వచ్చేశాయ్‌.. కేటగిరీ వైజ్‌ కటాప్‌ మార్కులు ఇవే!

దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌ పీజీ 2025 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. NBEMS ఫలితాలను మంగళవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. ఈ పరీక్షకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు జనరల్/EWS కేటగిరీలో 50 పర్సంటైల్ అంటే 276 మార్కులు,జనరల్ PwBD కేటగిరీలో 45 పర్సంటైల్ అంటే 255 మార్కులు, SC/ST/OBC/PwBD కేటగిరీలో 40 పర్సంటైల్ అంటే 235 మార్కులు

చంద్రబాబు, కేసీఆర్, జగన్, పవన్‌లకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ అధినేతలకు ఒక విజ్ఞప్తి చేశారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయిన జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు వ్యక్తికి అవకాశం కల్పించడం గర్వకారణమని పేర్కొన్నారు. జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలిపి.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి రాజ్యాంగాన్ని పరిరక్షకుడే కాకుండా.. రాజ్యాంగ […]

అల్లుడితో కలిసి హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తోందని… పిసి ఘోష్ కమీషన్ నివేదికను కూడా ఇందులో భాగమేనని బిఆర్ఎస్ అధినేత పేర్కొన్నారు. కాబట్టి ఈ కమీషన్ నివేదికపై స్టే ఇవ్వాలని ఆయన కోరారు. ఇలా కేసీఆర్, హరీష్ రావు దాఖలుచేసిన పిటిషన్లపై రేపు (బుధవారం) హైకోర్టు విచారణ చేపట్టే అవకాశాలున్నాయి.

వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, అల్లుడు కేసులను క్వాష్‌ చేసిన సుప్రీం కోర్టు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల బెయిల్‌ రద్దుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ.. సునీత తరఫు లాయర్‌ సిద్ధార్థ లూథ్రా తన వాదనలు వినిపించారు. హత్య కేసులో మరింత దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలిపారు. వివేకా కుమార్తె సునీతతోపాటు, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, అప్పటి సీబీఐ విచారణాధికారి రాంసింగ్‌పై పెట్టిన కేసులను క్వాష్ చేస్తామని ధర్మాసనం వివరించింది.

ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలు చేపట్టిన విద్యుత్ శాఖ అధికారులు

ఈ క్రమంలో విద్యుత్ శాఖ అధికారుల్లో చలనం వచ్చినట్లు కనిపిస్తుంది. రామాంతాపూర్‌, పాతబస్తీ బండ్లగూడలో జరిగిన విద్యుత్‌ ప్రమాదాలపై విద్యుత్‌ శాఖ అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. భారీ వర్షాల నేపథ్యంలో ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్ల వద్దని విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు సూచించారు. అంతేకాకుండా జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ డివిజన్‌లలో కరెంటు స్తంభాలకు ప్రమాదకరంగా వేలాడుతున్న కేబుళ్లను అధికారులు తొలగించే పనిలో పడ్డారు. ఇలా ఉప్పల్‌, రామాంతాపూర్, చిలకానగర్‌లలో విద్యుత్‌ అధికారులు ప్రత్యేక […]

ఇస్రో నుంచి మరో అద్భుతం- 40 అంతస్తుల రాకెట్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కొత్త భారీ రాకెట్‌ను నిర్మిస్తోంది. ఈ రాకెట్‌ ఎత్తు ఏకంగా 40 అంతస్తుల భవనం అంత ఉంటుంది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ ప్రకటించారు. ఇస్రో ఈ ఏడాదిలోనే నావిక్ శాటిలైట్, ఎన్-1 రాకెట్ ప్రయోగం, అలాగే అమెరికాకు చెందిన పెద్ద కమ్యూనికేషన్ శాటిలైట్‌ను కక్ష్యలోకి పంపించనుంది. ప్రస్తుతం భారత్‌కు 55 శాటిలైట్‌లు కక్ష్యలో ఉన్నాయి. రాబోయే 3-4 ఏళ్లలో ఈ సంఖ్య మూడు, నాలుగు రెట్లు పెరుగుతుంది.

తెలంగాణలో ఐటీ దాడులు.. మాజీ ఎంపీ నివాసంలో సోదాలు

చేవెళ్ల మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు రంజిత్ రెడ్డికి ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు షాకిచ్చారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌లోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి ప్రముఖ నిర్మాణ సంస్థ డీఎస్ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌లో జరుగుతున్న సోదాలకు కొనసాగింపుగా జరుగుతున్నాయి. ఐటీ అధికారులు డీఎస్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలో ఒకేసారి పలు చోట్ల దాడులు నిర్వహించారు. మొత్తం 10 బృందాలుగా విడిపోయిన అధికారులు CRPF బలగాల బందోబస్తు మధ్య సోదాలు నిర్వహిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON