భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కొత్త భారీ రాకెట్‌ను నిర్మిస్తోంది. ఈ రాకెట్ ఎత్తు ఏకంగా 40 అంతస్తుల భవనం అంత ఉంటుంది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ ప్రకటించారు. ఇస్రో ఈ ఏడాదిలోనే నావిక్ శాటిలైట్, ఎన్-1 రాకెట్ ప్రయోగం, అలాగే అమెరికాకు చెందిన పెద్ద కమ్యూనికేషన్ శాటిలైట్‌ను కక్ష్యలోకి పంపించనుంది. ప్రస్తుతం భారత్‌కు 55 శాటిలైట్లు కక్ష్యలో ఉన్నాయి. రాబోయే 3-4 ఏళ్లలో ఈ సంఖ్య మూడు, నాలుగు రెట్లు పెరుగుతుంది.

