ఎన్డీయే నుంచి ఉపరాష్ట్రపతి పదవికి సీపీ రాధాకృష్ణన్ ను అభ్యర్థిగా ప్రకటించిన విషయంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర గవర్నర్‌గా సేవలందిస్తున్న రాధాకృష్ణన్ ఎంపికను ఆయన హర్షంగా స్వీకరించారు. టీడీపీ తరఫున ఆయనకు సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.సోషల్ మీడియా వేదికగా స్పందించిన చంద్రబాబు, రాధాకృష్ణన్ అనుభవాన్ని కొనియాడారు. “అన్ని స్థాయిల్లో ప్రభుత్వ పదవుల్లో సేవలందించిన గొప్ప నాయకుడు. ఆయన రాజకీయ జీవితం సుదీర్ఘం, అనుభవంతో నిండిపోయినది,” అంటూ ప్రశంసలతో నింపారు.

