loader

పేరు మారిస్తేనే సినిమా విడుదల: సుప్రీం

బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి నటించిన తాజా చిత్రం ‘ఘూస్‌ఖోర్‌ పండత్‌’ శీర్షిక చిక్కుల్లో పడింది. ఈ సినిమా టైటిల్ వివాదాస్పదంగా మారడంతో సుప్రీంకోర్టు దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది. సమాజంలోని ఒక నిర్దిష్ట వర్గాన్ని కించపరిచేలా లేదా అవమానించేలా సినిమా పేర్లు ఉండకూడదని కోర్టు స్పష్టం చేసింది. వివాదాస్పదంగా ఉన్న ఈ టైటిల్‌ను వెంటనే మార్చాలని నిర్మాతలను ఆదేశించింది. టైటిల్ మార్పునకు సంబంధించిన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని చిత్ర బృందానికి సూచించింది.

సింగర్ పై సంచలన ఆరోపణలు చేసిన మొదటి భార్య

ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్‌ పై ఆయన మొదటి భార్య రంజన ఝా 1996లో చెకప్ కోసమంటూ తనను ఆసుపత్రికి తీసుకువెళ్లి తన అనుమతి లేకుండానే గర్భాశయాన్ని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అనారోగ్యంతో పాటు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ఆమె వెల్లడించారు. నాకు నా హక్కులు, గౌరవం కావాలి. 30 ఏళ్లుగా నేను చీకట్లోనే ఉన్నాను. న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నాను” అని రంజనా ఝా స్పష్టం చేశారు.

నటి నుంచి డాక్టర్‌గా.. మెడిసిన్ పట్టా అందుకున్న టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల తన జీవితంలో ఒక అద్భుతమైన ఘ‌ట్టాన్ని పూర్తిచేసుకుంది. వెండితెరపై నటిగా అలరిస్తున్న ఆమె, ఇప్పుడు అధికారికంగా డాక్టర్ శ్రీలీలగా మారారు. తన మెడికల్ డిగ్రీని (MBBS) విజయవంతంగా పూర్తి చేసిన శ్రీలీల తాజాగా కాన్వోకేష‌న్ వేడుక‌లో మెడిసిన్ ప‌ట్టాను అందుకుంది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. నిజానికి శ్రీలీల తన తల్లి, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ స్వర్ణలత గారిని స్ఫూర్తిగా తీసుకుని మెడిసిన్ వైపు అడుగులు వేశారు

రణ్​వీర్ సింగ్ నుంచి రూ.40 కోట్లు డిమాండ్ చేసిన నిర్మాత!

బాలీవుడ్ డాన్ ఫ్రాంచైజీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది. డాన్, డాన్ 2 తర్వాత రణ్​వీర్ సింగ్ కీలక పాత్రలో ఫర్హాన్ అక్తర్​ దర్శకత్వంలో డాన్ -3 నిర్మించనున్నట్లు ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ 2023లోనే ప్రకటించింది. అధికారికంగా ప్రకటించినా ఈ ప్రాజెక్ట్​ ఇప్పటికీ పట్టాలెక్కకలేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి రణ్​వీర్ తప్పుకోవడం వివాదానికి దారి తీసింది. దీంతో తమకు రూ.40 కోట్లు పరిహారంగా చెల్లించాలని నిర్మాణ సంస్థ రణ్​వీర్​ను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

‘స్పిరిట్’లో తన పాత్రపై రూమర్స్.. ప్రకాశ్ రియాక్షన్ ఇదే

సందీప్‌కి ప్రకాశ్ రాజ్‌కి గొడవ జరిగిందని.. ప్రకాశ్ రాజ్ ఈ సినిమాలో నటించడం లేదు అని సోషల్‌మీడియాలో వార్తలు వచ్చాయి  ప్రకాశ్ రాజ్ ఈ ఫేక్ న్యూస్‌లను ఖండించారు. ‘‘స్పిరిట్ గురించి విషపూరిత ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న వారందరికీ ఒక్కటే చెబుతున్నా..ఈ సినిమాకు సంబంధించి నేను నటించే ఒక్క సీన్‌ కూడా ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. కానీ, వాట్సాప్ ఫ్యాక్టరీలో ఊహాజనిత కథనాలు అల్లేస్తున్నారు. ఇప్పటికైనా నిద్ర లేవండి.. ఎవరి పని వాళ్లు చూసుకోండి’’ […]

జపాన్ ‘అనన్’ మ్యాగజైన్ కవర్ పేజ్‌పై ప్రభాస్ .. అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ రోజు రోజుకీ ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరిస్తోంది. తాజాగా జపాన్‌కు చెందిన ప్రముఖ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ ‘అనన్’ (Anan) కవర్ పేజీపై ప్రభాస్ కనిపించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఫిబ్రవరి 10న విడుదల కానున్న ఈ మ్యాగజైన్ 2483వ సంచిక బ్యాక్ కవర్‌పై ప్రభాస్ ప్రత్యేకంగా చోటు సంపాదించటం విశేషం. ఈ గౌరవం సాధించిన మొట్టమొదటి భారతీయ నటుడిగా ప్రభాస్ రికార్డు సృష్టించారు. ప్రభాస్‌ను “Royal Audience Gravure” అని […]

ప్రపంచ ఫిల్మ్ ఇండస్ట్రీ హబ్ గా హైదరాబాద్ :డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

ప్రసాద్ లాబ్స్ లో గద్దర్ ఫిలిం అవార్డుల సందర్భంగా సినిమాల స్క్రీనింగ్ ప్రక్రియ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించారు. వచ్చే ఉగాది రోజున గద్దర్ ఫిలిం అవార్డుల ఫంక్షన్ కార్యక్రమాన్ని న భూతో న భవిష్యత్తు అన్న నిర్వహించాలని ప్రపంచ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ వైపు తిరిగి చూసేలా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని అందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా అందిస్తుందని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

‘అది కల్పిత కథ మాత్రమే- ఏ వర్గాన్ని ఉద్దేశించింది కాదు’-కొత్త సినిమా టైటిల్ కాంట్రవర్సీపై మనోజ్ బాజ్​పాయి

బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్‌ తన లేటెస్ట్ సినిమా ‘గూస్కోర్ పండిట్’ టైటిల్​లోని ‘పండిట్’ పదంపై నెలకొన్న వివాదంపై స్పందించారు. ఈ టైటిల్ వల్ల మనోభావాలు దెబ్బతిన్న వాళ్లందరి భావాలను గౌరవిస్తానని తెలిపారు. సినిమాలో అది కేవలం కల్పిత పాత్రే అని, ఎవరిని ఉద్దేశించింది కాదని అన్నారు. ఈ మేరకు మనోజ్​ బాజ్​పాయి సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు.ప్రజల సెంటిమెంట్​ను గౌరవిస్తూ ప్రమోషనల్ వీడియోలను మేకర్స్ తొలగించారు.

మనోజ్ బాజ్‌ పాయ్‌ కొత్త సినిమాపై బ్రాహ్మణుల ఆగ్రహం.. సినిమాను అడ్డుకుంటామని వార్నింగ్

మనోజ్ నటించిన కొత్త సినిమా ట్రైలర్ విడుదలైంది. ఆ సినిమా పేరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. సినిమా పేరు మార్చకపోతే ఆ సినిమాను బహిష్కరిస్తామని చెబుతూ చాలా మంది పోస్ట్‌లను షేర్ చేశారు. మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ‘గుస్కోర్ పండిట్’. ‘గుస్కోర్ పండిట్’ అంటే చొరబాటుదారుడు పండిట్ అని అర్థం. బ్రాహ్మణులను అవమానించే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాకు ఈ పేరు పెట్టారని చాలా మంది దీనిపై ట్వీట్ చేశారు.

బూతుల పాట‌కి జేడీ చ‌క్ర‌వ‌ర్తి చ‌ప్ప‌ట్లు కొట్టడమేంట‌ని ట్రోల్స్..

బుల్లితెరపై నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ స్టేజిపై అతను అత్యుత్సాహంతో బూతు పదాలు ఉన్న పాట పాడటం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురైంది. అతిథిగా హాజరైన నటుడు జేడీ చక్రవర్తి తాను చప్పట్లు కొడుతూ ఆస్వాదించినట్లు చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రహాస్ పాట పాడుతుండగా తాను, మరో దర్శకుడు జయంత్ ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యపోయామని చెప్పారు. అప్పటికప్పుడు స్టేజ్ వదిలి వెళ్లిపోదామనుకున్నప్పటికీ, అలా చేస్తే సినిమా మీద నెగెటివ్ ప్రభావం పడుతుందని భావించి ఆగిపోయానన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON