loader

తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్‌ కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

తెలంగాణ టెట్ (TG TET-2026) ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. జనవరిలో జరిగిన ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను పాఠశాల విద్యాశాఖ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఫలితాలను https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి. అర్హత సాధించిన వారికి ఇచ్చే టెట్ సర్టిఫికెట్ జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. డీఎస్సీ (DSC) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ అర్హత తప్పనిసరి కాబట్టి, అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా […]

బిఆర్‌ఎస్ ఇప్పటికీ మా ఫోన్లను ట్యాపింగ్ చేస్తుంది: మంత్రి పొంగులేటి

ఒక ప్రక్క ఫోన్ ట్యాపింగ్ పై విచారణ కొనసాగుతున్నప్పటికి బి ఆర్ ఎస్ పార్టీ నేతలు ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ మంత్రుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని, వాళ్ళ వద్ద ఇంకా ట్యాపింగ్ పరికరాలు ఉన్నట్లు అనుమానం కలుగుతుందని  మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, జరుగుతోందని అనేక మంది గగ్గోలు పెడుతున్నారు.. ఇది అక్షరాలా నిజం. అసలు తాను ఉద్యోగులతో చేసిన సంభాషణకు సంబంధించిన ‘వాయిస్ కాల్ రికార్డ్’ బీఆర్‌ఎస్ నాయకులకు ఎలా […]

డికెకు మద్దతుగా 90మంది ఎంఎల్‌ఎల లేఖ!

కర్నాటకలో ముఖ్యమంత్రి పదవిలో డిప్యూటీ సిఎం శివకుమార్‌ను నియమించాలని కోరుతూ 80 మంది ఎంఎల్‌ఎలు హైకమాండ్‌కు లేఖ రాసినట్లు సమాచారం. ‘అవును. నిజమే 80 నుంచి 90 మంది శాసనసభ్యులం డికెకు అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి లేఖ రాశాం. ఇక సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర పలుమార్లు చేస్తున్న ప్రకటనలు అయోమయానికి గురి చేస్తున్నాయి. ఏది ఏమైనా మేం క్రమశిక్షణగా మెలగాల్సిన అవసరం ఉంది. అధిష్టానం ఏం చెబితే దాన్ని పాటించాల్సి ఉంటుంది’ అని కాంగ్రెస్ ఎంఎల్‌ఎ ఇక్బాల్ […]

శివ మాల దీక్షాధారులపై లాఠీఛార్జి దారుణం: వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ ప్రభుత్వం పాలనలో శివ మాలధారణ చేసిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేయ‌డం బాధాక‌రమని వైఎస్ జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో, ఆలయాలకు వెళ్లాలంటేనే భక్తులు భయపడిపోతున్నారని ఆరోపించారు. భక్తితో, నమ్మకంతో ఒకప్పుడు తీర్థయాత్రలు చేసిన భక్తులు, ఇప్పుడు ఆందోళన, అనిశ్చితితో దేవాలయాలకు వస్తున్నారని.. దీనిని చూస్తే ఏపీలో పరిస్థితి అర్థమవుతుందన్నారు. శ్రీశైలంలో శివస్వాముల ఆందోళనను ప్రస్తావిస్తూ ప్రభుత్వ విధానాలపై జగన్ విమర్శలు గుప్పించారు.

లోక్‌సభ స్పీకర్ కీలక నిర్ణయం.. అప్పటి వరకూ సభకు దూరం

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానం (No confidence Motion)పై చర్చ పూర్తయ్యేంత వరకూ సభకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్‌ను తొలగించాలంటూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ సెక్రటరీకి కాంగ్రెస్ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఓం బిర్లా ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో రాహుల్ గాంధీకి స్పీకర్ అవకాశం ఇవ్వలేదని, నిలదీసిన 8 మంది ఎంపీలపై సస్పెన్స్ వేటువేశారని విపక్షాలు తప్పుపడుతున్నాయి.

అర్జున్-సానియా పెళ్లి.. ప్రధాని మోడీకి ఆహ్వానం

భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన సానియాను అర్జున్ వివాహం చేసుకోబోతున్నాడు. మరికొద్ది రోజుల్లో వీరి వివాహం జరగనుంది. ఈక్రమంలో సచిన్ టెండూల్కర్ తన కుటుంబంతో కలిసి మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి.. అర్జున్-సానియా వివాహానికి ఆహ్వానించారు. ప్రధాని మోడీతో దిగిన ఫోటోలను సచిన్.. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఖాతాల్లో షేర్ చేశారు.

తెలంగాణలో రేపే మున్సిపల్ పోరు.. పోలింగ్‌కు సర్వం సిద్ధం

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. రేపు (ఫిబ్రవరి 11) రాష్ట్రవ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 2,996 వార్డులకు గాను 12,930 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 52 లక్షల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 26 లక్షలకు పైగా ఉన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 […]

వరల్డ్‌కప్ హీరోకు సచిన్ అపురూపమైన కానుక..

అండర్ -19 వరల్డ్‌కప్ హీరోలపై ప్రశంసల జట్లు కురుస్తోంది. జగజ్జేతలుగా స్వదేశం తిరిగొచ్చిన భారత బృందాన్ని దిగ్గజ ఆటగాళ్లు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తాజాగా కెప్టెన్ ఆయుశ్ మాత్రేకు అపురూపమైన కానుక అందించాడు. భారత్‌ను అజేయంగా నడిపించి విశ్వ విజేతగా నిలిపింనందుకు అతడికి తన టెస్టు జెర్సీని బహూకరించాడు. లెజెండరీ ఆటగాడి నుంచి విలువైన బహుమతి అందుకున్న మాత్రే సంతోషం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టాడు.

అసోంలో 2.4 లక్షల ఓట్లు తొలగింపు.. SIR అనంతరం కొత్త ఓటర్ల జాబితా విడుదల

అసోంలో 2.4 లక్షల ఓట్లను తొలగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అసోంలో ఎన్నికల సంఘం స్పెషల్ రివిజన్ (SIR) నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్ఆర్ నిర్వహించి తాజా జాబితా విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో మొత్తం 2,49,58,139 మంది ఓటర్లున్నారు.

గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌‌తో సీఎం చంద్రబాబు భేటీ

ఇవాళ ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయం సహా అనుబంధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. PM-PRANAM పథకం కింద ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్‌ను విస్తరించడానికి నిధులు విడుదల చేయాలని చంద్రబాబు కోరారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి రూ.216 కోట్లు ఇవ్వాలని చంద్రబాబు విన్నవించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON