loader

ఢిల్లీని ముంచిన ఫైనల్ ఫోబియా.. రెండోసారి ఛాంపియన్‌గా ఆర్సీబీ..!

మహిళల ప్రీమియర్ లీగ్‌ ఫైనల్లో రికార్డు స్కోర్ కొట్టినా ఢిల్లీ క్యాపిటల్స్ కల సాకారమవ్వలేదు. తొలి కప్‌ను ఒడిసిపట్టాలని భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉఫ్‌మనిపించింది. జార్జియా వోల్(79), కెప్టెన్ స్మృతి మంధాన(87)లు వీరవిహారం చేశారు. పసలేని ఢిల్లీ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ బౌండరీల మోతతో చెలరేగారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 165 పరుగుల జోడించి.. ఆర్సీబీని గెలుపు దిశగా నడిపారు.

టెట్ మినహాయింపు కోసం ఢిల్లీలో ఉపాధ్యాయుల ధర్నా

ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. ఇన్ సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులు అందరూ తప్పనిసరిగా టెట్ పై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని విద్యా హక్కు చట్టం 2010 లోని సెక్షన్ 23 సవరించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని, కేంద్ర […]

బీజేపీ అందరినీ ప్రచారానికి తెచ్చినా ఒక్క మున్సిపాలిటీ అయినా గెలుస్తారా? : సీఎం రేవంత్‌రెడ్డి

పాలమూరు జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ప్రచారానికి తీసుకువచ్చారని గుర్తు చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రచారానికి ప్రధాని సహా దేశం మొత్తం నేతలను తీసుకురండని హితువు పిలికారు. బీజేపీ అందరినీ ప్రచారానికి తెచ్చినా ఒక్క మున్సిపాలిటీ అయినా గెలుస్తారా? అడిగారు. కాంగ్రెస్‌ పార్టీ సత్తా ఏంటో బీజేపీకి చూపిస్తామని సవాల్ విసిరారు.కరీంనగర్‌ జిల్లా గుమ్లాపూర్‌లో పర్యటించిన సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.  తెలంగాణ ఏర్పాటు చేస్తామని సోనియాగాంధీ ఈ గడ్డపై నుంచి మాట ఇచ్చారని […]

హెన్రీ, జెమీమా ఊచకోత.. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఢిల్లీ రికార్డు స్కోర్..!

మహిళల ప్రీమియర్ లీగ్‌ నాలుగో సీజన్‌ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు శివమెత్తారు. వచ్చినవాళ్లు వచ్చినట్టు దంచేయగా డబ్ల్యూటీసీ టైటల్ పోరులో ఢిల్లీ రికార్డు స్కోర్‌తో చరిత్రకెక్కింది. ఓపెనర్లు శుభారంభమివ్వగా.. జెమీమా రోడ్రిగ్స్(57) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగింది. ఒత్తిడికి లోనైన ఆర్సీబీ బౌలర్లను ఆఖర్లో లారా వొల్వార్డ్త్‌(44), చిన్నెల్లీ హెన్రీ(32 నాటౌట్) బెంబేలెత్తించారు. డీక్లెర్క్ వేసిన 18వ ఓవర్లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన హెన్రీ 24 రన్స్ రాబట్టగా.. చివరి ఓవర్లో పది రన్స్ రావడంతో బెంగళూరుకు […]

వారందిరికీ శుభవార్త చెప్పిన చంద్రబాబు.. ఇకపై ఎలాంటి జీఎస్టీ ఉండదు!

రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరు అందించే బాధ్యతను సాగునీటి సంఘాలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అమరావతిలో నీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులతో గురువారం జరిగిన సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అందరికీ నీటి భద్రత అవసరమే కానీ, సంరక్షణ విషయం చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. నీటి సంఘాలు చేపట్టే పనులకు జీఎస్టీ లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.

గ్రూప్ 1పై తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: సిఎం రేవంత్‌రెడ్డి

గ్రూప్-1 నియామక ప్రక్రియకు సంబంధించి తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పుతో నిరుద్యోగుల కలసాకారం అయ్యిందని, ఇది గొప్ప విజయమని ఆయన అభివర్ణించారు. తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గ్రూప్-1 నియామక ప్రక్రియను అడ్డుకోవడానికి కొన్ని శక్తులు మొదటి నుంచి అనేక కుట్రలు పన్నాయని ఆయన విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కోర్టు కేసులు వేసినా చివరకు న్యాయ పోరాటంలో నిరుద్యోగుల పక్షాన నిలిచిన ప్రభుత్వం విజయం సాధించామని ఆయన ధీమా వ్యక్తం […]

పవన్.. రాజకీయాల కోసం ఇంతకు దిగజారాలా?: పేర్ని నాని

తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు, పవన్, లోకేశ్ తీరును ప్రజలు గమనిస్తున్నారని, తిరుమల లడ్డూపై కూటమి నేతలు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భోలే బాబా డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలు చేసింది చంద్రబాబు హయాంలోనే. భోలే బాబా నుంచి రూ.291కి నెయ్యి ఎలా కొనుగోలు చేశారో చెప్పాలి. హెరిటేజ్లో కిలో ఆవు నెయ్యి ఎంతకు అమ్ముతున్నారో చెప్పాలి.  అనేకసార్లు  దేవుడిపై నమ్మకం లేదన్న పవన్ . రాజకీయాల కోసం పవన్ కల్యాణ్ దిగజారి ప్రవర్తిస్తున్నారు అంటూ […]

టీచర్‌ను వేధించి.. ఆమె పెదాలు కొరికిన స్టూడెంట్

లేడీ టీచర్‌ను ఒక విద్యార్థి వేధించాడు. రోడ్డుపై వెళ్తున్న ఆమెను అడ్డుకున్నాడు. ఆ టీచర్‌ పెదవులను కొరికాడు. దీంతో ఆమె పెదాలకు తీవ్ర గాయమైంది. ఆ ఉపాధ్యాయురాలిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో ఈ సంఘటన జరిగింది. 12వ తరగతి చదువుతున్న విద్యార్థి స్కూల్‌ టీచర్‌ను వేధించాడు. దీంతో ఆమె ఫిర్యాదు చేయడంతో కొంతకాలం మానుకున్నాడు. మళ్లీ వేధింపులకు పాల్పడటంతో ఆ లేడీ టీచర్‌ వేరే స్కూల్‌లో చేరింది. అయినప్పటికీ ఆ విద్యార్థి ఆమెను […]

ఇద్దరూ ఇద్దరే.. రాహుల్, బిట్టూపై శిరోమణి ధ్వజం

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూపై శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి) తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇద్దరూ ఒకరిని ఒకరు తిట్టుకున్న మాటలలో నూటికి నూరుశాతం నిజం ఉందన్నారు. రాహుల్ , బిట్టూ మధ్య జరిగింది చూస్తూ ఉంటే దేశంలో రాజకీయం ఏ మేరకు దిగజారిందనేది తెలియవస్తోందని శిరోమణి అకాలీదళ్ నేత దల్జీత్ సింగ్ చీమా స్పందించారు. రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి బిట్టూను ద్రోహి అని తిట్టారు. ప్రతిగా బిట్టూ రాహుల్ […]

రేవంత్ రెడ్డి ఒక జాతిని టార్గెట్ చేయటం సరికాదు: కల్వకుంట్ల కవిత

రేవంత్ రెడ్డి అన్ని మర్యాదలను అతిక్రమించి మాట్లాడారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. వెలమజాతిని టార్గెట్ చేస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడారని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సిఎంగా ప్రమాణం చేసినప్పుడు ఏ బేధ భావం లేకుండా అందరినీ గౌరవిస్తానని ప్రమాణం చేశారని, అవన్నీ మరిచి పోయి ఒక జాతిని టార్గెట్ చేయటం సరికాదని హితవు పలికారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకనే ఇలా ఒక జాతిపై విషం చిమ్ముతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON