టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల తన జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టాన్ని పూర్తిచేసుకుంది. వెండితెరపై నటిగా అలరిస్తున్న ఆమె, ఇప్పుడు అధికారికంగా డాక్టర్ శ్రీలీలగా మారారు. తన మెడికల్ డిగ్రీని (MBBS) విజయవంతంగా పూర్తి చేసిన శ్రీలీల తాజాగా కాన్వోకేషన్ వేడుకలో మెడిసిన్ పట్టాను అందుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు ఫొటోలు వైరల్గా మారాయి. నిజానికి శ్రీలీల తన తల్లి, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ స్వర్ణలత గారిని స్ఫూర్తిగా తీసుకుని మెడిసిన్ వైపు అడుగులు వేశారు

