loader

ఏఐ ప్లాన్‌కు సిద్ధంగా లేకుంటే స్వచ్ఛందంగా నిష్క్రమించవచ్చు: గూగుల్

కృత్రిమ మేధ (AI)ను విస్తృతంగా వినియోగించుకుంటున్న నేపధ్యంలో ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ తన ఉద్యోగులకు ఒక అవకాశం కల్పించింది. కంపెనీ ఏఐ ప్రణాళికలకు సిద్దంగా లేనివారు, స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయొచ్చని వెల్లడించింది.ఈ మేరకు వారికి స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీని కల్పించింది. ఈ సందర్భంగా గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్‌ను ప్రస్తావిస్తూ బిజినెస్ ఇన్‌సైడర్ కథనం పేర్కొంది. గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ లోని కొందరు ఉద్యోగులకు ఈ ప్యాకేజీ వర్తించనుంది.

ముంబై మేయర్‌గా రీతూ తావ్డే ఏకగ్రీవం..

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్‌గా బీజేపీ కార్పొరేటర్ రీతూ తావ్డే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత 40 ఏళ్లలో ఈ ప్రతిష్టాత్మక పదవిని బీజేపీ దక్కించుకోవడం ఇదే మొదటిసారి. దీంతో బీఎంసీపై గత 25 ఏళ్లుగా సాగుతున్న థాకరే కుటుంబ ఆధిపత్యానికి తెరపడింది. శివసేన నేత సంజయ్ ఘాడి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. 53 ఏళ్ల రీతూ తావ్డే ఘాట్ కోపర్ వెస్ట్ నుండి మూడు సార్లు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.

కార్పొరేషన్లలో కాంగ్రెస్ హవా.. ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్ సర్వే

పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో కార్పొరేషన్లలో వార్డుల వారీగా అంచనాలు  రామగుండం | కాంగ్రెస్ 30-34 | బీఆర్ఎస్ 16-20 | బీజేపీ 3-6 | ఇతర 4-7,  మంచిర్యాల | కాంగ్రెస్ 39-43 | బీఆర్ఎస్ 8-12 | బీజేపీ 6-9 | ఇతర 1-2, నిజామాబాద్ |కాంగ్రెస్ 10-16 | బీఆర్ఎస్ 2-4 | బీజేపీ 26-31 | ఎంఐఎం 8-12,   కరీంనగర్ | కాంగ్రెస్ 14-16 | బీఆర్ఎస్ 10-12 | […]

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా.. ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్ సర్వే

తెలంగాణలో ఇవాళ జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకోనుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. మొత్తంగా 68-76 మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనుంది. 29-36 మున్సిపాలిటీలను ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, 3-5 బీజేపీ, 0-1 ఎంఐఎం గెలుచుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ తన సర్వే ఫలితాల్లో పేర్కొంది. 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 36%, బీఆర్ఎస్ 29.7%, బీజేపీ […]

మావోల బెదిరింపులు.. ఎపి మంత్రుల ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం

ఎపిలో ఒకేసారి నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు రావడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్య కుమార్ యాదవ్, కందుల దుర్గేష్‌లకు మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖలు వచ్చాయి. అసలు కారకులను గుర్తించేందుకు పోలీసులు, ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగాయి. మరోవైపు మంత్రుల భద్రతను పర్యవేక్షించే అధికారులు కూడా ఈ లేఖల అసలు మూలాలను ఆరా తీస్తున్నారు. మావోయిస్టుల లేఖలు వచ్చి న కారణంగా ఆ నలుగురు మంత్రుల నివాసాల వద్ద […]

అంబటి రాంబాబుకు షాకిచ్చిన పోలీసులు – మరో కేసులో పీటీ వారెంట్ దాఖలు

మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబుకు కోర్టులో ఊరట లభించిన కొద్ది గంటల్లోనే మళ్ళీ చిక్కులు మొదలయ్యాయి. ఆయన జైలు నుంచి విడుదల కాకుండానే సత్తెనపల్లి పోలీసులు గుంటూరు సబ్ కోర్టులో మరో పీటీ వారెంట్ దాఖలు చేశారు. 2023 నాటి సంక్రాంతి లక్కీ డ్రా అవినీతి కేసులో ఆయనను విచారించాల్సి ఉందని పోలీసులు పేర్కొనడంతో ఆయన విడుదలపై సందిగ్ధత నెలకొంది.

గ్రూప్-1పై హైకోర్టు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌ లో గ్రూప్-1 పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేయాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అడిషనల్ డీజీ స్థాయి అధికారితో సిట్ విచారణ జరపాలని వ్యాఖ్యానించింది. ఎంపికైన అభ్యర్థుల జవాబు పత్రాలు భద్రంగా ఉన్నాయా లేదా అని ఫోరెన్సిక్ నిపుణులతో నిర్ధారించాలని ఆదేశించింది. ఇప్పటికే ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులు.. దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశమున్నందున వారందరినీ అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలని సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది.

ఐర్లాండ్ పై ఆస్ట్రేలియా ఘన విజయం

ICC టీ20 ప్రపంచ కప్‌ (T20WC) లో భాగంగా ఆస్ట్రేలియా, ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ ( 37), మార్కస్ స్టోయినిస్ ( 45), కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఐరిష్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆ […]

ప్రతి ఒక్కరూ కూటమి ధర్మానికి కట్టుబడి ఉండాలి…మరో 15 ఏళ్లు కూటమి కొనసాగాలి: సీఎం, డిప్యూటీ సీఎం

రాష్ట్రంలో మరో 15 ఏళ్ల పాటు కూటమి ఐక్యత ఇలాగే కొనసాగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. ఈ 20 నెలల్లో కూటమి నాయకత్వంలో ఎక్కడా విభేదాలు ఏర్పడలేదని… ఇది శుభ పరిణామమని చెప్పిన సీఎం ఇదే ఐక్యత ఇకపైనా కొనసాగాలని, అప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ 20 నెలల్లో చాలా కష్టపడి, ఐక్యంగా పని చేశామని సమావేశంలో పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం 15 ఏళ్లు కూటమి కలిసి ఉంటుందని, ఐక్యంగా ముందుకు వెళతుందని […]

ఆగిన బైకుపై ఉన్న చిన్నారులపైకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. పిల్లలు మృతి

బెంగళూరులో దారుణం జరిగింది. రోడ్డుపై కానిస్టేబుల్ ఒక బైకుమీద పిల్లలతో ఆగిఉండగా.. వారిపైకి స్కూల్ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించారు. ఈ ఘటన నార్త్ బెంగళూరులోని మూల మలుపు వద్ద పిల్లలిద్దరితో కలిసి బైకుపై ఆగిఉన్నాడు. అదే సమయంలో అక్కడికి ఒక స్కూల్ బస్సు వేగంగా వచ్చి టర్న్ తీసుకుంది. రోడ్డుపై ఉన్న వీరిని గమనించకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా స్కూల్ బస్సు నడిపాడు. దీంతో బైకు పక్కకు పడిపోగా, చిన్నారులిద్దరూ బస్సు టైర్ల […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON