loader

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్

ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ చిన్ను పప్పు (రేష్మ–24) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.. కేరళలో కాసర్కోడ్ నగర సమీపంలోని అద్దె క్వార్టర్స్‌లో ఆమె సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్న చిన్ను పప్పు స్థానిక భాషలో వీడియోలతో ప్రసిద్ధి చెందింది. ఆమెకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. కేవలం నెల రోజుల క్రితమే ఆమె విడాకులు తీసుకున్నట్లు సమాచారం. విడాకులతో  తలెత్తిన మనస్తాపం లేదా వ్యక్తిగత కారణాలేమైనా  ఆత్మహత్యకు దారితీశాయా అనే […]

ప్రచురణ కాని మాజీ ఆర్మీ చీఫ్‌ పుస్తకంపై విస్తృత ప్రచారం.. కేసు నమోదు

మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేకు సంబంధించిన ప్రచురణ కాని పుస్తకం ప్రచారంలోకి రావడంపై ఢిల్లీ పోలీసులు దృష్టిసారించారు. రాజకీయ వివాదాన్ని రాజేసిన ఈ పుస్తకం ప్రచారంపై కేసు నమోదు చేశారు. ఆర్మీ జనరల్ ఎంఎం నరవణేకు సంబంధించిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం ఇంకా ప్రచురణ కాలేదు. ఈ పుస్తకం ప్రచురణకు సంబంధిత అధికారుల నుంచి అవసరమైన అనుమతి ఇంకా లభించలేదు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రాంగణంలో ఈ పుస్తకం […]

కెనడాలో భారత సంతతి వ్యక్తి హత్య

కెనడాలో ఓ భారత సంతతి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కర్ణాటకు చెందిన చందన్‌కుమార్ అనే వ్యక్తి కాల్పులకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. టొరొంటోలో శనివారం ఈ ఘటన జరిగింది. రెక్స్‌డేల్ బోలీవార్డ్‌లో వుడ్‌బైన్ షాపింగ్ సెంటర్‌ పార్కింగ్ స్థలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చందన్ కుమార్ బ్రాంప్టన్ ప్రాంతంలో నివసించేవాడని పోలీసులు తెలిపారు. అతడి కారు వద్దనే కాల్పులకు గురయ్యాడని తెలిపారు

ఒవైసీ సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ గెలుపుపై షాకింగ్ ప్రశ్న!

ఎంఐఎం అధినేత  అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. “రెడ్లు అయినా, రావులు అయినా మా దగ్గరకే రావాల్సిందే” అంటూ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశారు. ముఖ్యమంత్రుల దగ్గరకు తాము వెళ్లమని, అవసరమైతే వాళ్లే తమ వద్దకు రావాలని ఓవైసీ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రస్తావిస్తూ, ఎంఐఎం మద్దతు లేకుండా కాంగ్రెస్ నిజంగా గెలిచిందా? అని ప్రశ్నించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం సత్తా ఏమిటో స్పష్టంగా చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

విజయవాడ పశ్చిమ నెంబర్ వన్ – నియోజకవర్గాలకు ర్యాంకులిచ్చిన ప్రభుత్వం

వివిధ అభివృద్ధి ,సంక్షేమ సూచికల ఆధారంగా 175 నియోజకవర్గాల ర్యాంకింగ్స్‌ ఇచ్చింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో 21 నియోజకవర్గాలు ఏ ప్లస్ (A+) గ్రేడ్ సాధించగా, 153 నియోజకవర్గాలు ఏ గ్రేడ్ దక్కించుకున్నాయి. కేవలం ఒకే ఒక నియోజకవర్గం బి గ్రేడ్‌కు పరిమితం కావడం గమనార్హం. రాష్ట్రంలోనే 93 శాతం మార్కులతో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. ఎమ్మెల్యే సుజనా చౌదరి మార్క్ అభివృద్ధికి నిదర్శనంగా నిలిచింది. రెండవ స్థానంలో నిలిచిన గాజువాకకు […]

గవర్నర్ ప్రసంగానికి హాజరు కానున్న వైసీపీ ఎమ్మెల్యేలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఒక్క రోజు .. గవర్నర్ ప్రసంగానికి హాజరు కావాలని వైసీపీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా అనర్హత వేటు భయం కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రజాప్రతినిధి అయినా సభ అనుమతి లేకుండా వరుసగా 60 పనిదినాల పాటు సమావేశాలకు గైర్హాజరైతే, వారి సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం స్పీకర్‌కు ఉంటుంది. కనీసం ఒక్క రోజు హాజరై సంతకం చేయడం ద్వారా ఆ సాంకేతిక ఇబ్బందిని అధిగమించాలని ఈ […]

స్కూల్ బస్సును ఢీ కొట్టిన ట్రాక్టర్.. ఇద్దరు మృతి, 12 మందికి తీవ్రగాయాలు

వరంగల్‌ జిల్లాలోని పర్వతగిరి మండలం శ్రీనగర్ క్రాస్ రోడ్డు వద్ద సోమవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఓ కుటుంబం అన్నారం షరీఫ్ దర్గాలో కందూరు చేసుకొని తిరిగి ట్రాక్టర్‌లో వస్తుండగా తీగరాజుపల్లికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తా పడడంతో అందులో ఉన్న చిన్నారితో పాటు డ్రైవర్‌ మృతి చెందారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. ట్రాక్టర్ డ్రైవర్ మద్యంమత్తు ప్రమాదానికి కారణమని […]

హైబ్రిడ్ మోడల్ లొల్లి.. పాకిస్థాన్, బంగ్లాదేశ్ కొత్త ప్లాన్ ఇదే

2031 వన్డే ప్రపంచకప్‌కు భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే, ప్రస్తుతం అమలులో ఉన్న హైబ్రిడ్ మోడల్ ఒప్పందం 2027 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఈ గడువును 2031 ఎడిషన్ వరకు పొడిగించాలని పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఇప్పుడు కోరుతున్నాయి. ఈ పొడిగింపు జరిగితే, 2031 ప్రపంచకప్‌లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ తమ మ్యాచ్‌లన్నింటినీ కేవలం బంగ్లాదేశ్‌లోనే ఆడే వెసులుబాటు పొందుతాయి. వ్యూహాత్మక డిమాండ్ ద్వారా భవిష్యత్తులో కూడా భారత్‌లో పర్యటించకుండా ఉండేందుకు ఈ రెండు బోర్డులు పావులు […]

తమిళనాడులో టీఎంపీవీ కొత్త తయారీ కేంద్రం ప్రారంభం..!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ ప్యాసింజర్‌ వెహికల్స్‌ (TMPV) లిమిటెడ్‌ తమిళనాడులో కొత్త తయారీ కేందాన్ని ప్రారంభించారు. రాణిపేట జిల్లాలోని పాణపక్కంలో ఏర్పాటుచేసిన ఈ ప్లాంట్‌ను సోమవారం తెరిచారు. కార్యక్రమంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌, టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ పాల్గొన్నారు. టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌తోపాటు, దాని అనుబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్ రోవర్ (JLR) కు చెందిన కార్లనూ ఇక్కడే తయారుచేస్తారు.

‘స్పిరిట్’లో తన పాత్రపై రూమర్స్.. ప్రకాశ్ రియాక్షన్ ఇదే

సందీప్‌కి ప్రకాశ్ రాజ్‌కి గొడవ జరిగిందని.. ప్రకాశ్ రాజ్ ఈ సినిమాలో నటించడం లేదు అని సోషల్‌మీడియాలో వార్తలు వచ్చాయి  ప్రకాశ్ రాజ్ ఈ ఫేక్ న్యూస్‌లను ఖండించారు. ‘‘స్పిరిట్ గురించి విషపూరిత ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న వారందరికీ ఒక్కటే చెబుతున్నా..ఈ సినిమాకు సంబంధించి నేను నటించే ఒక్క సీన్‌ కూడా ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. కానీ, వాట్సాప్ ఫ్యాక్టరీలో ఊహాజనిత కథనాలు అల్లేస్తున్నారు. ఇప్పటికైనా నిద్ర లేవండి.. ఎవరి పని వాళ్లు చూసుకోండి’’ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON