మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేకు సంబంధించిన ప్రచురణ కాని పుస్తకం ప్రచారంలోకి రావడంపై ఢిల్లీ పోలీసులు దృష్టిసారించారు. రాజకీయ వివాదాన్ని రాజేసిన ఈ పుస్తకం ప్రచారంపై కేసు నమోదు చేశారు. ఆర్మీ జనరల్ ఎంఎం నరవణేకు సంబంధించిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం ఇంకా ప్రచురణ కాలేదు. ఈ పుస్తకం ప్రచురణకు సంబంధిత అధికారుల నుంచి అవసరమైన అనుమతి ఇంకా లభించలేదు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రాంగణంలో ఈ పుస్తకం నకలును ప్రదర్శించారు.

