తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన 10 గ్రామాల రైతులతో సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం అర్ధరాత్రి సమావేశం అయ్యారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. రెండో విడత భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు కౌలును ప్రకటించారు. ఎకరానికి రూ. 40 వేల చొప్పున పదేళ్లపాటు కౌలు చెల్లిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. అలాగే కుటుంబానికి రూ. 1.50 లక్షల మేర వ్యవసాయ రుణ మాఫీకి ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు.

