నటుడు ప్రకాష్ రాజ్ రామాయణాన్ని వక్రీకరిస్తూ చేసిన వ్యాఖ్యలపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఘాటుగా స్పందించారు. ‘శ్రీరామచంద్రుడు కేవలం హిందువుల దైవం మాత్రమే కాదు, ఆయన ధర్మానికి ప్రతిరూపం. రాముడిని తక్కువ చేయాలని చూడటం ధైర్యం కాదు అది అహంకారం, రామ నామాన్ని ఎగతాళి చేసేవారు తమను తాము గాయపరుచుకుంటారు తప్ప, ధర్మాన్ని ఏమీ చేయలేరు. చరిత్రలో అధర్మం వైపు నిలిచిన వారు ఎలా కాలగర్భంలో కలిసిపోయారో, రాముడిపై విషం చిమ్మే వారి గమ్యం కూడా అలాగే ఉంటుంది” అంటూ నాగబాబు హెచ్చరించారు.

