సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృ సంస్థ మేటా మరోసారి భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. మే 20న ప్రారంభమయ్యే తొలి విడత లేఆఫ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో సుమారు 10 శాతం అని నివేదికలు చెబుతున్నాయి. ఏఐ ఆధారంగా సంస్థ పనితీరును మరింత సమర్థవంతంగా మార్చాలనే వ్యూహంలో భాగంగా ఉద్యోగులను తగ్గించే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

