loader

85% చూపు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్!

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పిటిఐ (PTI) అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై వెలువడుతున్న వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్, తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా గత మూడు నెలలుగా ఆయన కంటి చూపు మందగించడం ఆందోళన కలిగిస్తోంది. సుప్రీంకోర్టు నియమించిన లాయర్ అందించిన నివేదిక ప్రకారం, ఇమ్రాన్ ఖాన్ తన కుడి కంటిలో దాదాపు 85% చూపును కోల్పోయారు. మరియు దీర్ఘకాలంగా వైద్య సహాయం అందకపోవడమే దీనికి ప్రధాన కారణమని […]

వాట్సాప్‌కు రష్యా షాక్..

ప్రముఖ మేసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌కు రష్యా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దానిని బ్లాక్ చేసింది, తద్వారా ప్రజలకు అందుబాటులో లేకుండా చేసింది. తమ దేశ చట్టాలకు వాట్సాప్ కట్టుబడి ఉండేందుకు విముఖత చూపడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వాట్సాప్ స్థానంలో మ్యాక్స్ అనే మేసేజింగ్ యాప్‌ను రష్యా తీసుకురానుంది. ‘మా యాప్‌ను పూర్తిగా బ్లాక్ చేసేందుకు రష్యా ప్రయత్నించింది. 100 మిలియన్‌ల మంది యూజర్లను భద్రతమైన మేసేజింగ్ వ్యవస్థకు దూరం చేయడం తిరోగమన చర్య. అని […]

NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నటుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా చిట్ చాట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్టీఆర్ జాతీయ నాయకుడు. ఎన్టీఆర్ గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడితే వారంత మూర్ఖులు ఎవరు ఉండరు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టిందే కాంగ్రెస్ పార్టీ’ అని అన్నారు.

హంతకుడు యూనస్ హయాంలో బూటకపు ఎన్నికలు.. వెంటనే రద్దు చేయాలి.

హంతకుడు ముహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్‌లో బూటకపు ఎన్నికలు జరిగాయని మాజీ ప్రధాని షేక్ హసీనా మండిపడ్డారు. ఫాసిస్ట్ యూనస్ హయంలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికలను తక్షణమే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. గురువారం పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికలను ఖండిస్తూ హసీనా ప్రకటన విడుదల చేశారు. అప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికలు జరిగాయని బంగ్లాదేశ్‌లో ఓటర్లు పాల్గొనకుండా, చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగిన ఎన్నికలను రద్దు చేయాలి. యూనస్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ […]

ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (FRI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 52 ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు వారి విద్యార్హతలను బట్టి ఇంటర్మీడియట్, బి.ఎస్సీ (BSc), లేదా ఎం.ఎస్సీ (MSc – ఫారెస్ట్రీ, బోటనీ, బయోటెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్), పీహెచ్‌డీ (PhD) ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://fri.icfre.gov.in ను సంప్రదించవచ్చు

ఫుడ్ డెలివరీ రంగంలోకి ఈ-కామర్స్ సంస్థ ఎంట్రీ?

వాల్‌మార్ట్‌కు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరో కీలక రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ-కామర్స్, క్విక్ కామర్స్ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఫ్లిప్‌కార్ట్, ఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలోకి ప్రవేశించాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇప్పటికే మినిట్స్ పేరుతో క్విక్ కామర్స్ విభాగంలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ, మే-జూన్ నెలల్లో బెంగళూరులో ప్రయోగాత్మకంగా సేవలు ప్రారంభించనుంది. ఈ వార్తలతో స్విగ్గీ, జొమాటోల షేర్లు గురువారం స్వల్పంగా నష్టపోయాయి.

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ – 15 రోజుల్లో కొత్త ఆరోగ్య పథకం

ఉద్యోగులు, పెన్షనర్లు, వారి డిపెండెంట్లకు నగదు రహిత అపరిమిత వైద్య సేవలు అందేలా కొత్త ఈహెచ్‌ఎస్‌ పథకం ఉంటుందని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. రాష్ట్రంలో ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని పది రోజుల్లో ప్రారంభించాలని నిర్ణయించారు. ఉద్యోగులు తమ మూల వేతనంలో ఒకటిన్నర శాతం చందా ఇస్తే అంతే మొత్తంలో ప్రభుత్వం వాటాగా ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన ఉద్యోగుల హెల్త్‌కేర్ ట్రస్ట్ సమావేశం జరిగింది.

మధ్యతరగతి ప్రజలను అణచివేస్తున్నట్లు కాదు: నిర్మలా సీతారామన్​

వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు పెరగడం అంటే మధ్యతరగతి ప్రజలను అణచివేయడం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రాజ్యసభలో  బడ్జెట్‌పై జరిగిన చర్చలపై ఆమె ఈ మేర వ్యాఖ్యానించారు. పన్ను వసూళ్లు పెరుగుతున్నాయంటే దేశంలో మధ్యతరగతి వర్గం విస్తరిస్తుందనే అర్థం తప్ప, క్షీణించడం లేదని ఆమె వెల్లడించారు. పన్ను వసూళ్ల పెరుగుదలపై వస్తున్న ఆరోపణలను ఆమె తోసిబుచ్చారు. అది ఆర్థిక వ్యవస్థ పటిష్ఠతకు నిదర్శనమని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు నిధులు తగ్గించినట్లు […]

సవాళ్లు-ప్రతిసవాళ్లతో దద్దరిల్లిన మండలి – గవర్నర్ ప్రసంగంపై వాడీవేడి చర్చ

గవర్నర్ ప్రసంగంపై ధన్యాదాలు తెలిపే తీర్మానంపై శాసన మండలిలో అధికార, విపక్షాల మధ్య వాడీ వేడీ చర్చ జరిగింది. పరస్పరం సవాళ్లు ప్రతిసవాళ్లతో సభ దద్దరిల్లింది. గవర్నర్ ప్రసంగంలోని అంశాలపై వైఎస్సార్సీపీ సభ్యులు విమర్శలు చేయగా ఆరోపణలను అధికారపార్టీ సభ్యులు దీటుగా తిప్పి కొట్టారు. ఆరోపణలు నిరూపించేందుకు తాము సిద్దమని వైఎస్సార్సీపీ సభ్యులు సవాల్ విసరగా, దమ్ముంటే నిరూపించాలని దీనికి తాముసైతం సిద్దమని అధికారపార్టీ నేతలు ప్రతిసవాల్ విసిరారు.

గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి నిధులు విడుదల

రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఆలస్యం కావడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు పెండింగ్‌లో ఉండగా ఇప్పుడు అవి విడుదల అవుతున్నాయి. తొలి విడత కింద ఇటీవల తెలంగాణ పంచాయతీలకు రూ.259.36 కోట్లను మోదీ సర్కార్ విడుదల చేసింది.తాజాగా రెండో విడత నిధులను కూడా రిలీజ్ చేసింది. రెండో విడతలో భాగంగా రూ.387 కోట్లని అందించింది. దీంతో రెండు విడతల్లో కలిపి మొత్తంగా రూ. 646.36 […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON