loader

మత్స్యకారులకు హెచ్చరిక..! ఫిబ్రవరి 14 నుండి చేపల వేట నిషేధం, కారణం..?

విశాఖ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వేడుకులు జరగనున్నాయి.సదస్సుకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఈ  వేడుకల్లో ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ ఆర్నాలతో పాటు, 61 దేశాలకు చెందిన 23 యుద్ధ నౌకలు పాల్గొంటాయన్నాయి. ఈ కార్యక్రమం నేపథ్యంలో ఫిబ్రవరి 14 నుంచి 21 వరకు నేవీ బోట్లు నిలుపుదల చేసే సముద్ర ప్రాంతాల్లో చేపల వేట చేపట్టకుండా, అలాగే బోట్లు సంచరించకుండా సహకరించాలని మత్స్యకారులకు మత్స్యశాఖ జేడీ విజ్ఞప్తి […]

ఎప్‌స్టీన్ ఫైల్స్ వల్లనే బిల్‌గేట్స్‌తో బంధం ముగిసింది : మిలిందా

ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం దర్యాప్తులో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు ఇతర మహిళలతో లైంగిక సంబంధాలు ఉన్నట్టు బయటపడడం వల్లనే తమ వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పినట్టు బిల్‌గేట్స్ మాజీ భార్య మిలిందా వెల్లడించారు. ఈ వివరాలు తెలియడంతో తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యానని తెలిపారు. వైవాహిక బంధం విలువలు ఆయన నిలబెట్టుకోకపోవడం వల్లనే విడాకులు తీసుకున్నట్టు చెప్పారు. దర్యాప్తులో బయటపడిన విషయాలపై ఆయనే సమాధానం చెప్పుకోవాలని, తాను కాదని వ్యాఖ్యానించారు.

మణిపూర్ కొత్త ముఖ్యమంత్రిగా వై. ఖేమ్ చంద్ సింగ్ ప్రమాణం

మణిపూర్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన యుమ్నాం ఖేమ్ చంద్ సింగ్ బుధవారం నాడు ప్రమాణస్వీకారం చేశారు.గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఆయన చేత సీఎంగా ప్రమాణం చేయించారు. కుకి వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నమ్చా కిఫ్గెన్, నాగా పీపుల్స్ ఫ్రంట్ శాసన సభ్యుడు ఎల్ దిఖో మణిపూర్ డిప్యూటీ ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీకి చెందిన గోవిందాస్ కోంథోజామ్ , ఎన్ పిపికి చెందిన కె. లోకెన్ సింగ్ కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం […]

ఆంధ్రాలో రాజకీయం చేసుకో! – పవన్ కళ్యాణ్‌పై మహేష్ గౌడ్ ఫైర్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు  తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి ఎన్నో విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ మాటలు వినే స్థితిలో ఇక్కడి ప్రజలు లేరు భిక్షాందేహి అని పవన్ కళ్యాణ్‌ను అడుక్కునే దీన స్థితిలో తెలంగాణ బీజేపీ ఉంది.కులం, మతం పేరిట బీజేపీ మోసం చేయాలని చూసినా తెలంగాణ ప్రజలు మోసపోరు, పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేసుకోవాలంటే ఆంధ్రాలో చేసుకో.. తెలంగాణలో కాదు – కాంగ్రెస్ […]

ఏ విధంగా కేసీఆర్ జాతిపిత – నల్లగొండలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ జాతిపిత అంశంపై కేసీఆర్ కుటుంబం చేస్తున్న ప్రచారాన్ని రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ను జాతిపితగా పిలుచుకుంటామని, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని  తెలంగాణ తల్లి గా గౌరవించుకుంటామని స్పష్టం చేశారు. అసలు ఏ ప్రాతిపదికన మిమ్మల్ని  మీరు జాతిపితగా పిలుచుకుంటున్నారు అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఫోన్  ట్యాపింగ్‌లకు పాల్పడి, భార్యాభర్తల మధ్య జరిగే ప్రైవేట్ సంభాషణలను కూడా విన్న మీకు జాతిపిత అని పిలిపించుకునే నైతిక హక్కు లేదని, ఈ పనులకు మీరు సిగ్గుపడాలని ఘాటుగా […]

మీ సేవింగ్స్‌ను పెట్టిబడిగా మార్చి లాభాలు పొందండి.. జియో–బ్లాక్‌రాక్ ప్రధాన లక్ష్యం కూడా అదే..

భారతీయులు ఏళ్లుగా పొదుపు చేస్తున్నా.. అది సంపద సృష్టిగా మారడం లేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ వ్యాఖ్యానించారు. అయితే ఈ పరిస్థితి జియో–బ్లాక్‌రాక్‌కు భారతీయ కుటుంబాల పొదుపును పెట్టుబడుల వైపు మళ్లించేందుకు పెద్ద అవకాశాన్ని కల్పిస్తోందని ఆయన తెలిపారు. ముంబైలో నిర్వహించిన జియో–బ్లాక్‌రాక్ ఫైర్‌సైడ్ చాట్లో, బ్లాక్‌రాక్ సీఈఓ లారీ ఫింక్తో కలిసి మాట్లాడిన ముకేశ్ అంబానీ , భారతీయుల ఆర్థిక ప్రవర్తనపై కీలక విశ్లేషణ చేశారు.

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత! MHA నోటిఫికేషన్ జారీ!

దాదాపు ఏడాది తర్వాత బుధవారం (ఫిబ్రవరి 4, 2025) మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. ఫిబ్రవరి 13, 2025 నుంచి మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన అమలులో ఉంది. రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత, 60 మంది సభ్యుల శాసనసభను తాత్కాలికంగా నిలిపివేశారు. అసెంబ్లీ పదవీకాలం 2027లో ముగుస్తుంది. కొత్తగా నియమితులైన బిజెపి శాసనసభా పక్ష నాయకుడు యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్ మణిపూర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు అభ్యర్థన పెట్టుకున్నారు. దీంతో […]

| వైసీపీ అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏంటో ఊహించుకోండి.. చంద్రబాబు శ్రేణులకు వైఎస్‌ జగన్‌ హెచ్చరిక

ఏపీ సీఎం చంద్రబాబు రెడ్ బుక్‌తో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పి, జంగిల్ రాజ్‌లా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని హెచ్చరించారు. ఇటీవల గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ మూకల దాడి, అంబటి రాంబాబు అరెస్టు వ్యవహరం తరువాత బుధవారం అంబటి కుటుంబాన్ని […]

ఏపీలో హింసపై జాతీయ మానవహక్కుల కమిషన్‌కు వైసీపీ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న హింసాత్మక వాతావరణం ,నిరంకుశ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్‌( NHRC ) కు బుధవారం ఫిర్యాదు చేశారు. . ఈమేరకు ఛైర్మన్ జస్టిస్ సుబ్రహ్మణ్యంను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై ఇటీవల జరిగిన దాడులు , వైఎస్ఆర్‌సీపీ కార్యకర్త సల్మాన్ రాజు దారుణ హత్యను చైర్మన్‌కు వివరించారు. ఈ సందర్భంగా వీడియోలు, ఫోటోల రూపంలో సాక్ష్యాలను […]

రైతులందరూ ఏకమై రేవంత్ రెడ్డి వీపు పగలగొట్టడం ఖాయం : హరీష్‌ రావు

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్‌చెరువు నియోజకవర్గంలోని గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీలలో హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ప్రజలను ఓటు అడిగే నైతిక అర్హత లేదు. మహిళలకు మహాలక్ష్మి కింద రూ. 2500 రాలేదు, వృద్ధులకు రూ. 4000 పెన్షన్ రాలేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ లేదు,మున్సిపాలిటీల్లో రైతులు ఉండరని, వాళ్లకు రైతుబంధు వేయకపోయినా నడుస్తుందని రేవంత్ రెడ్డి భ్రమలో ఉన్నాడు.సగం మున్సిపాలిటీల్లో ఉన్నది రైతులే. ఈ మున్సిపల్ ఎన్నికల్లో రైతులందరూ ఏకమై రేవంత్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON