మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్‌చెరువు నియోజకవర్గంలోని గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీలలో హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ప్రజలను ఓటు అడిగే నైతిక అర్హత లేదు. మహిళలకు మహాలక్ష్మి కింద రూ. 2500 రాలేదు, వృద్ధులకు రూ. 4000 పెన్షన్ రాలేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ లేదు,మున్సిపాలిటీల్లో రైతులు ఉండరని, వాళ్లకు రైతుబంధు వేయకపోయినా నడుస్తుందని రేవంత్ రెడ్డి భ్రమలో ఉన్నాడు.సగం మున్సిపాలిటీల్లో ఉన్నది రైతులే. ఈ మున్సిపల్ ఎన్నికల్లో రైతులందరూ ఏకమై రేవంత్ రెడ్డి వీపు పగలగొట్టడం ఖాయమన్నారు.

