హరివంశ్ హ్యాట్రిక్ కొట్టారు. మూడోసారి ఆయన రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్‌గా ఎన్నికయ్యారు. సభాపక్ష నేత జేపీ నడ్డా తీర్మానం పాస్ చేయగా .. హరివంశ్ ఎన్నిక ప్రక్రియ లాంఛనంగా పూర్తి అయ్యింది. మోజువాణీ ఓటు ద్వారా డిప్యూటీ చైర్మెన్ నియామకం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రాజ్యసభకు హరివంశ్‌ను నామినేట్ చేశారు. మూడోసారి డిప్యూటీ చైర్మెన్‌గా గెలిచిన హరివంశ్‌కు ప్రధాని మోదీ, విపక్షనేత ఖర్గు కంగ్రాట్స్ తెలిపారు. రాజ్యసభ చరిత్రలో ఓ నామినేటెడ్ సభ్యుడు డిప్యూటీ చైర్మెన్‌గా ఎన్నిక కావడం ఇదే తొలిసారి.

