టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ రోజు రోజుకీ ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరిస్తోంది. తాజాగా జపాన్‌కు చెందిన ప్రముఖ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ ‘అనన్’ (Anan) కవర్ పేజీపై ప్రభాస్ కనిపించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఫిబ్రవరి 10న విడుదల కానున్న ఈ మ్యాగజైన్ 2483వ సంచిక బ్యాక్ కవర్‌పై ప్రభాస్ ప్రత్యేకంగా చోటు సంపాదించటం విశేషం. ఈ గౌరవం సాధించిన మొట్టమొదటి భారతీయ నటుడిగా ప్రభాస్ రికార్డు సృష్టించారు. ప్రభాస్‌ను “Royal Audience Gravure” అని అభివర్ణించడం అభిమానులను మరింత గర్వపడేలా చేసింది.

