loader

మణిపూర్‌లో బంద్…కుకీల ఆగ్రహంతో ఉద్రిక్తత

మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ జిల్లాలో శుక్రవారం పూర్తి స్థాయిలో హర్తాళ్ జరిగింది. దీనితో సాదారణ జనజీవితం స్తంభించింది. కుకీ జో ప్రాబల్యం ఉన్న ఈ జిల్లాలో రెండు ఆదివాసీ సంస్థలు బంద్‌కు పిలుపు నిచ్చాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ఇద్దరు ఈ ప్రాంతపు ఎమ్మెల్యేలు కార్యక్రమాల్లో పాల్గొనడం వివాదానికి దారితీసింది. శుక్రవారం ఉదయం పలు ప్రాంతాల్లో నిరసనకారులు చేతుల్లో లాఠీలు పట్టుకుని జిల్లా ప్రదాన కేంద్రంలో వచ్చిపోయే వాహనాలను నిలిపివేశారు.విద్యా సంస్థలు, మార్కెట్లు మూతపడ్డాయి.  తుయిబాంగ్ ప్రాంతంలో బంద్ […]

స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో అగ్నీ-3 పరీక్ష విజయవంతం

భారత సైనిక దళాలకు చెందిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో తాజాగా జరిగిన అగ్ని-3 పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్‌లోగల ఇంటిగ్రేటెడ్ టెస్టు రేంజ్‌‌లో ఈ పరీక్ష విజయవంతమైందని రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సాంకేతిక, కార్యనిర్వహణ లక్ష్యాలు అన్నిటినీ మిసైల్ అందుకుందని రక్షణ శాఖ తెలిపింది.  అగ్నీ-3 మిసైల్ 3 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను, అగ్నీ-4 మిసైల్‌ 4 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. ఇక అగ్నీ-5 మిసైల్ రేంజ్ అత్యధికంగా […]

రేపటి నుంచి టి20 వరల్డ్ కప్..

అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. టి20 వరల్డ్‌కప్ టోర్నమెంట్‌కు శనివారం తెరలేవనుంది. భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీలో 20 జట్లు పోటీ పడుతున్నాయి. బరిలో ఉన్న జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. శనివారం ఉదయం పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్ల మధ్య కొలంబోలో జరిగే మ్యాచ్‌తో వరల్డ్‌కప్ టోర్నీకి తెరలేస్తోంది.

బీజేపీ, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం- నిజామాబాద్‌లో సీఎం రేవంత్

నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావు గా మారి కేసీఆర్‌ను కాపాడుతున్నారని, బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఉన్నది ఫెవికాల్ బంధం అని ఆరోపించారు. బీజేపీకి ఓటు వేసినా, బీఆర్ఎస్‌కు ఓటు వేసినా అది మూసీ నదిలో వేసినట్లేనని ఓటర్లను హెచ్చరించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో, పన్నెండేళ్ల మోదీ పాలనలో నిజామాబాద్ సమస్యలు పరిష్కారం […]

పులిని బంధించారు.. హమ్మయ్య అనుకున్న ప్రజలు

అంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో గత కొద్ది రోజులుగా ప్రజలకు భయభాంతులకు గురి చేస్తున్న పెద్దపులిని కూర్మాపురంలో అటవీ శాఖ అధికారులు బంధించారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చి దాన్ని పట్టుకున్నారు. పులిని పట్టుకోవడానికి పూణెకు చెందిన ఓ ప్రత్యేక బృందం రంగంలోకి దిగినట్లు అధికారులు తెలిపారు. ఐదు గంటలపాటు ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ చేసి పులిని పట్టుకున్నారు.

అండర్ 19 ప్రపంచకప్ విజేతగా భారత్.. ఆరోసారి ట్రోఫీ ఎత్తిన యువసేన

భారత జట్టు ఆరోసారి అండర్-19 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. శుక్రవారం ఇంగ్లాండ్‌పై భారత జట్టు 100 పరుగుల భారీ విజయాన్ని సాధించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో 50 ఓవర్లలో 9 వికెట్లకు 411 పరుగులు చేసింది. 412 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది. కాలేబ్ ఫాల్క్‌నర్ 115 పరుగులు చేశాడు.

పవన్ ఎన్నికల ప్రచారం రద్దు

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచార కార్యక్రమాలు అనివార్య కారణాలతో రద్దయ్యాయి. ఇటీవల జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా పవన్ ప్రచారం చేస్తారని జనసేన కేంద్ర కార్యాలయం ప్రకటించింది. శనివారం, ఆదివారం ఆయన ప్రచార షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే, ఈ ప్రచారం రద్దు కావడం చర్చనీయాంశమైంది.

జగన్ పర్యటనలో..ఇద్దరు వైసీపీ పార్టీ కార్యకర్తలు మృతి..

ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పర్యటన సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. చిల్లకల్లు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త డి. రాంబాబు (45) స్వాగత ఏర్పాట్లలో భాగంగా జోగి రమేష్‌ నివాసం వద్దకు చేరుకున్న సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. పల్స్‌ పడిపోవడంతో అక్కడున్న నేతలు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బైక్‌పై స్టంట్‌ చేస్తూ రోడ్డుపై ఉన్న గేట్‌ను వేగంగా ఢీకొని మరో […]

ఈనెల 12న జరిగే కార్మికుల దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దాం : దాస్యం వినయ్‌భాస్కర్‌

ఈనెల 12న జరిగే కార్మిక దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దామని బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్‌భాస్కర్‌ పిలుపునిచ్చారు. కార్మిక సంఘాల ఉమ్మడి సన్నాహాక సమావేశాన్ని శుక్రవారం హనుమకొండ అశోకా కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ 4 లేబర్‌ కోడ్స్​‍ను రద్దు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వం రైతు, కార్మిక, ఉద్యోగుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు.

అబద్ధాన్ని సృష్టించి.. దానికి రెక్కలు కట్టి మరీ దుష్ప్రచారం చేశారు: వైఎస్ జగన్

జోగి రమేష్ ఇంట్లో దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన వైఎస్ జగన్.. ఆపై కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. తిరుమల లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదని సీబీఐ స్పష్టం చేసింది. ఒక అబద్ధాన్ని సృష్టించి..లడ్డూలో జంతువుల కొవ్వు అంటూ విష ప్రచారం చేశారు.చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారు. జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాటిళ్లతో దాడులు చేయడం కూటమి ప్రభుత్వం అరాచక పాలనకు నిదర్శనమంటూ మండిపడ్డారు వైఎస్ జగన్

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON