loader

ఏపీలో భానుడి భగభగలు..నేడు అత్యధికంగా 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. వేసవి తాపానికి జనం అల్లాడిపోతుండగా, రోజురోజుకూ ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఈ రోజు రాష్ట్రంలోనే అత్యధికంగా గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ములుకుదురులో 47.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదై అధికారిక వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా, పల్నాడు జిల్లా గురజాలలో 47.6 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లతో పాటు బాపట్ల జిల్లా ఇంకొల్లులో 47.3 డిగ్రీల మేర భానుడు ప్రతాపం […]

మేం వెళ్లగొట్టకముందే పారిపోండి: సిఎం హెచ్చరిక

పశ్చిమబెంగాల్‌లో నివాసం ఉంటున్న బంగ్లాదేశ్ అక్రమవలసదారులను స్వదేశానికి పంపేందుకు చర్యలు తీసుకుంటోంది. ‘మేం చర్యలు ప్రారంభించకముందే పారిపోండి’ అంటూ ముఖ్యమంత్రి తాజాగా హెచ్చరించారు.తక్షణం అక్రమవలసదారులు ఈ ప్రదేశాన్ని వదిలివెళ్లాల్సిందేనని అన్నారు. అక్రమ చొరబాటుదారులను జైళ్లకు పంపవద్దని తాను పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. ‘వాళ్లకు మనమెందుకు ఆతిథ్యం ఇవ్వాలి?.. దేశ వనరులను ఎందుకు దుర్వినియోగం చేయాలి. చొరబాటుదారులు ఏమైనా మన అల్లుళ్లా?’ అని ప్రశ్నించారు. తమ పౌరులను వెనక్కి తీసుకునే బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వంపైనే ఉందన్నారు.

విజయ్ ఢిల్లీ పర్యటనకు ముందు..కర్ణాటకతో వివాదంపై ప్రధాని మోదీకి లేఖ

తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దళపతి జోసెఫ్ విజయ్ తన మొదటి అధికారిక ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన మేకెదాటు డ్యామ్ ప్రతిపాదనలను తిరస్కరించాలని కోరారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో మేకేదాటు నిర్మాణం కోసం కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం భూమిపూజకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో విజయ్ స్పందించారు.

నాకు ఏపీ పోలీసులు ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదు: ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌

సామాజిక మాధ్యమాల్లో తనపై చేస్తున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ను కోరినట్లు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలిపారు. డీజీపీని కలిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తన వ్యాఖ్యలను ఇప్పటికే ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. ఏపీ పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పష్టం చేశారు.

మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ

మావోయిస్టు పార్టీ మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, బీహార్‌-జార్ఖండ్ స్పెషల్ ఏరియా కార్యదర్శి పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, అలియాస్ సలైదాతో పాటు ఆయన భార్య, రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేదర దానమ్మ అలియాస్ లత, అలియాస్ పూనం, అలియాస్ జోబా మంగళవారం డిజిపి ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డిజిపి సివి.ఆనంద్ మాట్లాడుతూ దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమం మారుతు వస్తుందని, ప్రస్తుతం పూర్తిగా కనుమరుగయ్యిందని చెప్పారు.

లెబనాన్‌లో 12 మంది మృతి…

తూర్పు లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. మష్గారా అనే ఓ గ్రామంపై జరిపిన దాడిలో 12 మంది మృతి చెందారు. దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు స్పందించారు. హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్‌లపై మరిన్ని దాడులు తీవ్రంగా చేసే అవకాశం ఉందని ప్రకటించారు. లెబనాన్‌లో మరిన్ని అదనపు బెటాలియన్లను తరలిస్తున్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది.

బిగ్ రిలీఫ్…తిరుమలలో ఒక్కసారిగా మారిన వాతావరణం..

ఎండ తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమలలోని భక్తులకు భారీ ఉపశమనం లభించింది. తిరుమలలో ఒక్కసారిగా వాతావరణం మారింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడి భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా పడ్డ వర్షానికి ఆలయ పరిసర ప్రాంతాలు, ముఖ్యమైన రహదారులు నీటి మునిగాయి. మరోవైపు నగరిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. వర్షం వల్ల పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది.

బెల్జియంలో స్కూల్ బ‌స్సును ఢీకొన్న రైలు.. అనేక మంది మృతి

బెల్జియంలో తీవ్ర విషాద ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. ఓ స్కూల్ బ‌స్సును.. రైలు ఢీకొన్న‌ది. ఆ ప్ర‌మాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. గాయ‌ప‌డ్డ‌వారి సంఖ్య కూడా అధికంగా ఉంది. ప్ర‌మాద బాధితుల్లో చాలా మంది ఉన్న‌ట్లు బెల్జియం మంత్రి బెర్నార్డ్ క్వింటిన్ తెలిపారు. అయితే అధికారులు మాత్రం క‌చ్చిత‌మైన మృతుల సంఖ్య‌ను వెల్ల‌డించ‌లేదు. బుగ్గెన్‌హోట్‌లో జ‌రిగిన ప్ర‌మాదం విషాదాన్ని నింపింద‌ని, బాధితుల ప‌ట్ల సంతాపం చెబుతున్న‌ట్లు మంత్రి తెలిపారు.

ఆర్టీసీ బస్సులో మంటలు.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు

హైదరాబాద్‌లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS)లో మంగళవారం ప్లాట్‌ఫాంపై ఆగి ఉన్న గద్వాల డిపోకు చెందిన  ఈ బస్సు నుంచి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగలు చెలరేగడంతో  బస్టాండ్‌లో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బస్సు ఇంజిన్ భాగం నుండి ఒక్కసారిగా మంటలు వ్యాపించడాన్ని గమనించిన డ్రైవర్, కండక్టర్ వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేశారు. దీంతో లోపల ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనల  నడుమ ఒకరినొకరు నెట్టుకుంటూ, ప్రాణాలు చేతబట్టుకుని బస్సు దిగి ప్లాట్‌ఫాంపైకి పరుగులు తీశారు.

గోదావరిలోకి పరిశ్రమ వ్యర్థాలు కలవడంపై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ఆగ్రహం

గోదావరి కాలుష్య నివారణకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ రంగంలోకి దిగారు.  తూర్పు గోదావరి జిల్లా వెంకటనగరం వద్ద ఆంధ్రాపేపర్‌ మిల్స్ వ్యర్థాలు నేరుగా నదిలో  కలవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీటి నమూనాలను పరీక్షలకు పంపాలని అధికారులను ఆదేశిస్తూ, దీనిపై టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ వెంట జనసేప పార్టీకి చెందిన ఏపీ మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేశ్‌ ఉన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON